Telugu News

1800 కి.మీ పూర్తైన నారా లోకేష్ `యువగళం’ పాదయాత్ర

వైఎస్ జగన్ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సాగిపోతున్న `యువగళం' పాదయాత్ర మంగళవారం మరో మైలురాయిని అధిగమించింది. లోకేష్ చేపట్టిన  పాదయాత్ర 138వరోజు గూడూరు నియోజకవర్గం చిట్టమూరు...

షర్మిల ఏపీ రాజకీయాలకు నో … వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పట్టు!

దిగవంతి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రెండేళ్ల క్రితం పెట్టిన వైఎస్సార్ టిపిని విలీనం చేసుకొనేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం సుముఖంగా ఉన్నప్పటికీ, షర్మిలకు కాంగ్రెస్ లో ఇచ్చే ప్రాధాన్యత విషయంలో...

కాంగ్రెస్ తో సయోధ్య కోసం ఓవైసీ ఎత్తు!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చివరి వరకు వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో ఉద్యమ పార్టీగా 2014లో గెలుపొందగానే స్వయంగా ఇంటికి వెళ్లి అప్పటి నుండి కలిసి ఉందామని ముఖ్యమంత్రి...

డిప్యూటీ సీఎం కామెడీ.. పవన్‌పై తిట్లు బ్యాక్ ఫైర్!

జగన్ అనుచర వర్గంలో డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో పేరు మోసిన వ్యక్తి. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు గమనిస్తే.. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారో పొగుడుతున్నారో కూడా...

జగన్ దుర్బుద్ధికి జై కొడుతున్న కేంద్ర సర్కారు!

అమరావతి రాజధానిని అస్తిత్వం అంటూ లేకుండా సర్వనాశనం చేసేయాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి దుర్బుద్ధి. అందుకు సంబంధించి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయవచ్చో ఆయన అన్నీ చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని మాత్రమే గుర్తించి,...

హవ్వ.. దీనిని ‘భావప్రకటన స్వేచ్ఛ’ అంటారా?

మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నదనే సంగతి అందరికీ కనిపిస్తూనే ఉన్న సంగతి. రామోజీరావును అరెస్టు చేసి.. ఒక్కరోజైనా జైల్లో ఉంచడమే లక్ష్యంగా సీఐడీ దర్యాప్తు...

మళ్లీ పంచాయతీ.. జగన్ అసమర్థతేనా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన సొంత పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల సంగతి కూడా సాధారణంగా ఇతరులకు అప్పగిస్తూ ఉంటారు. నాయకుల మధ్య పంచాయతీ చేయడాన్ని బహుశా ఆయన తన స్థాయికి...

సంకీర్ణం వస్తుందని కలగంటున్న ముస్లింనేత!

తెలంగాణ రాజకీయాల్లో ఒక చిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా అధికారం కోసం తలపడుతున్న మూడు పార్టీలు.. ఎవరికి వారు తామే అధికారంలోకి వచ్చి తీరాలని ఆరాటపడుతూ, వచ్చి తీరుతామని బయటకు చెప్పుకుంటూ...

పొంగులేటి సభ.. బిజెపి గుండెల్లో రాయి!

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాను కాంగ్రెస్ లో చేరబోతున్న సంగతిని అధికారికంగా ప్రకటించారు. న్యూఢిల్లీలో అటు రాహుల్ గాంధీ, ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున...

వాళ్లు చెప్పిందే చేసేట్లయితే తమరెందుకు?

తెలంగాణలో కేసీఆర్ ను గద్దెదించడానికి కాంగ్రెస్, బిజెపి రెండూ కూడా భీషణమైన ప్రతిజ్ఞలు చేస్తున్నాయి. అందరికీ అధికారం కావాలి. కేసీఆర్ సర్కారు రెండు దఫాలు విజయం సాధించింది గనుక.. ఎంతో కొంత ప్రజావ్యతిరేకతను...

`నాలుగేళ్ల నరకం’ పేరుతో టీడీపీ సరికొత్త ప్రచారం

వైసీపీ పాలనపై నాలుగేళ్ల నరకం పేరుతో టీడీపీ సరికొత్త ప్రచార కార్యక్రమం చేపట్టిందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. కాగా  ఈ క్యాంపెయిన్‌లో...

చివరకు కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి

బిఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత తమ రాజకీయ భవిష్యత్ గురించి గత ఆరు నెలలుగా ఎటూ తేల్చకుండా రోజుకొక ఊహాగానానికి ఆస్కారం కల్పిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,...

అసమ్మతి ఎమ్యెల్యేల రాజీనామాలపై వైసీపీకి చిక్కులు!

నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని పార్టీ నుండి సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్యెల్యేలు నేరుగా టిడిపి కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటె ఏమీ చేయలని చిక్కుల్లో అధికార వైసీపీ నేతలు...

ధరణి పోర్టల్ పై నడ్డా – సంజయ్ చెరో మాట

తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తున్నామంటున్న బిజెపి నేతలలో ఎవ్వరి దారి వారిదయింది. కీలక మైన ప్రజాసమస్యల పైన కూడా అంతర్గతంగా చర్చలు, అధ్యయనాలు, నిర్దుష్టమైన విధానం రూపొందించుకోవడం లేదని మరోసారి స్పష్టమైంది. ఎవ్వరికీ ఇష్టం...

నడ్డా పర్యటనకు ఈటెల, కోమటిరెడ్డి దూరం!

తెలంగాణాలో బిజెపి వ్యవహారాలపై ఢిల్లీకి పిలిపించుకొని, సుదీర్ఘంగా చర్చించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆ మరుసటి రోజు తన తెలంగాణ పర్యటనలో కనిపించక పోవడం పట్ల...

తాగుబోతోడు మాట పట్టుకొని తలనొప్పి తెచ్చుకున్న పవన్ కళ్యాణ్

2024 ఎన్నికల్లో జనసేనకు ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు భారీ వ్యూహంతో పవన్ కళ్యాణ్ తలపెట్టిన `వారాహి విజయ యాత్ర' మొదటి దశ తూర్పుగోదావరి జిల్లాలో  దారితప్పిందా? అంటే అవుననే రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు....

ఐటీ, ఈడీ దాడుల ప్రభావంతోనే కేటీఆర్ ఢిల్లీ యాత్ర!

తెలంగాణ మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ యాత్ర జరిపి, వరుసగా కేంద్ర మంత్రులను కలవడం అధికార పార్టీ వారికి కూడా ఆశ్చర్యం కలిగించింది. కేంద్ర మంత్రులను నిత్యం ఘాటుగా విమర్శించడమే గాని, కలవడం...

నడ్డా, అమిత్ షాలను నమ్మొద్దు, వచ్చేయండి!

తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. కాంగ్రెసు పార్టీ గేరు మార్చుతోంది. కర్ణాటక ఎన్నికలన తర్వాత.. ఇప్పటికే తెలంగాణలో చాలా మంది ఆ పార్టీ వైపు చూస్తున్నట్టుగా వాతావరణం మారుతోంది. షర్మిల విలీనం గురించి...

బండి సంజయ్ కొనసాగితే ఒక్క సీటు కూడా గెలవం!

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణాలో మొన్నటి వరకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. కొత్తగా...

కాంగ్రెస్ – ఆప్ రగడతో ప్రశ్నార్ధకంగా ప్రతిపక్ష కూటమి!

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి, కనీసం 450 సీట్లలో ఉమ్మడిగా పోటీచేసి, కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలో పాట్నాలో ఈ నెల 23న ఒక...

అమిత్ షా – కేటీఆర్ భేటీకి ఈటెల అడ్డుకట్ట!

తెలంగాణ రాజకీయాలలో కలకలంకు దారితీసిన శనివారం రాత్రి జరగవలసిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ  అనూహ్యంగా రద్దయింది. అందుకు ప్రధాన కారణం అంతకు ముందే అమిత్...

`ప్రజారాజ్యం’ విలీనంపై మరోసారి పవన్ అసంతృప్తి!

తన అన్న చిరంజీవి `ప్రజారాజ్యం' పార్టీని ఏర్పాటు చేసినప్పుడు క్రియాశీలంగా వ్యవహరించి, ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారంలో కూడా పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం...

నెల్లూరులో బాబాయ్ – అబ్బాయ్ లడాయి!

నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుతోంది. బాబాయి- అబ్బాయిల లడాయి శృతిమించి.. ఒకరి గురించి ఒకరు ప్రజల్లో నెగటివ్ ప్రచారం చేసేదాకా వెళ్లింది....

ఎర్ర పార్టీలను గులాబీ దళపతి నమ్ముతారా?

తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంత వరకు భారాసకు, వామపక్ష పార్టీల మద్దతు ప్రస్తుతానికి ఉంది. భారాసగా పార్టీని ప్రకటించిన తర్వాత.. మునుగోడులో జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా వామపక్షాలు కూడా వారికి పూర్తిగా సహకరించారు....

చిన కోమటిరెడ్డి.. కప్పల తక్కెడ యవ్వారమేనా!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అంతో ఇంతో సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు కప్పల తక్కెడ వ్యవహారం లాగా ఉంది. తక్కెడలో కప్పలను వేస్తే ఆ తూకం ఎప్పటికైనా ఎలా...

ముద్రగడతో డేమేజీనే! : వైసీపీ డోర్స్ క్లోజ్!!

‘ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే’ అనం సంస్కృతంలో ఒక సుభాషితం ఉంటుంది. ఈ ప్రపంచంలో, ప్రయోజనం ఆశించకుండా ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క పనీ చేయరు గాక చేయరు.. అనేది ఈ...

ఏపీలో కాంగ్రెస్ ప్రచారంకు షర్మిల విముఖత!

వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలిసి పనిచేసే విషయమై వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానంతోనే తేల్చుకునేందుకు ఆమె స్వయంగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్...

లోకేష్‌కు ముడిపెట్టడం దిగజారుడు కాదా?

కడపలో పట్టపగలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డి హత్యకు గురయ్యారు. జిమ్ కు వెళ్లి బయటకు వచ్చిన ఆయనపై బురఖాల్లో పొంచి ఉన్న వ్యక్తులు వేటకత్తులతో దాడిచేసి హత్యచేశారు. ఆయనను...

షర్మిలక్క విలీనం జగన్ కు దబిడి దిబిడే!

వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు విలీన ఎత్తుగడనే ఆశ్రయిస్తున్నారు. ఇన్నాళ్లూ ఒంటరిగా తన రెక్కల కష్టం మీదనే పార్టీని నడుపుతూ వచ్చిన...

విజయశాంతి, డీకే అరుణలతో కాంగ్రెస్ నేతల మంతనాలు

తెలంగాణ బీజేపీలో సంక్షోభకర పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీలో చేరేవారెవ్వరు కనిపించకపోగా, ఉన్న నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముఖ్యంగా ఇతర పార్టీల నుండి వచ్చిన ప్రముఖ నేతలు పార్టీలో...

జనసేనకు ఏపీలో మళ్లీ గ్లాస్ గుర్తు

జనసేనకు ఎన్నికల గుర్తుపై ఏర్పడిన అస్పష్టతకు తెరపడింది. ఇటీవల ఎన్నికల కమీషన్ ప్రకటించిన ఎన్నికల గుర్తుల రిజర్వేషన్ జాబితాలో జనసేన గుర్తు లేకపోవడం, జనరల్ గుర్తుగా ఎవరైనా ఉపయోగించుకొనే సౌలభ్యం ఉండడంతో వచ్చే...

కాంగ్రెస్ నేతలకి గాలం వేస్తున్న కేసీఆర్

కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తి జోష్ లో ఉన్న కాంగ్రెస్ బిఆర్ఎస్ లో అసంతృప్తి నేతలపై దృష్టి సారిస్తూ ఒకోరోక్కరిని తమ పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. ముందుగా...

విపక్ష కూటమిలో ఆప్.. కాంగ్రెసుకు ఇష్టం లేదా?

మోడీ సర్కారును గద్దె దించడానికి దేశంలోని భాజపాయేతర విపక్షాలు అన్నింటినీ ఏకతాటిమీదకు తీసుకురావాలని అనుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంకల్పంలో తొలి అడుగు సవ్యంగానే పడింది. అయితే ఈ తొలి అడుగుతోనే...

తగ్గేదే లే : ఆ భూములపై గులాబీ కన్ను!

సికింద్రాబాద్ లోని సైనిక భూములపై భారాసకు కన్నుంది. కేసీఆర్ మొదటి సారి సీఎం అయినప్పుడే.. రక్షణ శాఖ పరిధిలో ఉండే ఈ భూములను రాష్ట్రప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా అప్పటినుంచి మంతనాలు సాగించారు. కానీ.. రక్షణశాఖకు...

ఈటెల, కోమటిరెడ్డి బండి సంజయ్ సంగతి తేల్చుకుంటారా!

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీలో ఇతర పార్టీల నుండి ఎవ్వరూ చేరే పరిస్థితి లేకపోవగా, ఇదివరలో ఇతర పార్టీల నుండి చేరిన వారిలో ఎవ్వరు ఉంటారు, మరెవ్వరు వెడతారో తెలియని సందిగ్ధత...

కాంగ్రెస్ తో పొత్తు కోసం రాయబారం నడిపిస్తున్న షర్మిల

తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలి వైఎస్ షర్మిల తోసిపుచ్చారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినమైన జులై 8న ఆయనకు నివాళులు అర్పించేందుకు తమ...

కాపుల రచ్చలో చంద్రబాబును ఇరికిస్తున్న కమ్మనేత!

సాధారణంగా రాజకీయనాయకులకు ఒక టెక్నిక్ ఉంటుంది. తమ రాజకీయ ప్రత్యర్థుల్లో ఎవరైనా ఒక నాయకుడిని అత్యంత దారుణంగా తిట్టించాలని అనుకుంటే గనుక,  ఆ నాయకుడి కులానికే చెందిన వారిని తమ పార్టీనుంచి ఎంపిక...

పిఠాపురంపై కర్చీఫ్ వేసిన కాపునాయకుడు!

ముద్రగడ పద్మనాభం అప్పుడప్పుడూ వార్తల్లో వ్యక్తిగా హాట్ హాట్ గా మెరిసి తర్వాత మాయం అవుతుంటారు. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన విమర్శలు చేయడం ద్వారా ఆయన వార్తల్లో హాట్...

‘ఆ ఒక్కటీ తప్ప..’: వరాలు కురిపించిన కేసీఆర్!

మరో అయిదు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా ఉద్యోగ వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు. తెలంగాణ సాధన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. ఉద్యోగులు...

షర్మిలక్క ఎంట్రీకి ముందే షాకులు ఇస్తున్నారా?

వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తుందని, ఆమె కోరుకున్నట్టుగాకు ఆమెకు ఖమ్మం జిల్లా పాలేరు టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగానే ఉన్నదని ఇటీవల...

కేసీఆర్ నోట `ఓటమి’ భయం.. అమిత్ షాతో కేటీఆర్ భేటీ!

గత తొమ్మిదేళ్లలో బహుశా ముఖ్యమంత్రి కేసీఆర్ నోట `ఓటమి' భయం వ్యక్తం కావడం, మరో వంక అకస్మాత్తుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీకి ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ఢిల్లీకి...

ద్వితీయ శ్రేణి నాయకత్వంపై చంద్రబాబు ఫోకస్‌

సుదీర్ఘకాలం టిడిపిలో ఉంటూ, 2019లో అధికారం కోల్పోగానే పార్టీ కార్యక్రమాలను సరిగ్గా పట్టించుకోకుండా, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తిరిగి క్రియాశీలకంగా కనిపిస్తున్న నాయకులపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఓ కన్నేసి...

ఎన్టీఆర్ అభిమానులు పవన్ వైపు మొగ్గు!

నందమూరి, నారా కుటుంబాలు దూరంగా ఉంచుతూ ఉండడంతో గత పదేళ్లకి పైగా టీడీపీకి దూరంగా ఉంటున్న `జూనియర్' ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన...

పూర్తిగా పరువు పోగొట్టుకున్న ముద్రగడ!

తనకు సంబంధం లేని వ్యవహారంలో అనవసరంగా తలదూర్చి.. అంతో ఇంతో ఉన్న పరువును కూడా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పోగొట్టుకున్నారనే అభిప్రాయం ఇప్పుడు ఆ సామాజికవర్గంలోనే వ్యక్తం అవుతోంది. ముద్రగడ అనుయాయుల్లో...

అమరవీరుల జ్యోతి స్థూపం అద్భుతమే! కానీ…

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల స్మృత్యర్థం ఒక అత్యద్భుతమైన అమరవీరుల జ్యోతి స్థూపాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం  ప్రారంభించారు. హైదరాబాదులో ఇటీవలే నిర్మించిన నూతన...

శ్రీవాణి : ట్రస్టు నిధుల లెక్కచెబితే చాలదు!

తిరుమల శ్రీవాణి ట్రస్టు రూపంలో భక్తులకు వీఐపీ దర్శన టికెట్లు విక్రయిస్తూ వసూలు చేస్తున్న సొమ్ముల గురించి.. ఇప్పుడు చాలా పెద్ద వివాదం రేకెత్తుతోంది. శ్రీవాణి దర్శన టికెట్ల కోసం వసూలు చేస్తున్న...

ఎంపీకి చుక్కలు చూపిస్తున్న జనసేన నేత!

ప్రభుత్వాల అవినీతిని, అరాచకత్వాన్ని ప్రశ్నించడానికే తమ పార్టీ పుట్టిందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతుంటారు. ఆయన స్వయంగా అదే పనిచేస్తుంటారు. ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తుంటారు. తన ఉద్యమగళాన్ని...

ఎవరి ఎజెండాలు వారివి: ఇంకేం ఐక్యత!

భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించడానికి ప్రతిపక్షాలు అన్నింటినీ ఒక్కతాటిమీదకు తేవాలని బీహార్ ముఖ్యమంత్రి కంటున్న కలలు అంత సులువుగా నెరవేరుతాయా? అనే అనుమానాలు ఇప్పుడు పుడుతున్నాయి. విపక్షాల మద్య ఐక్యత పురిట్లోనే...

డేవిల్ ఈజ్ బ్యాక్.. జనసైనికుల అంతు తేలుస్తా!

తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాలపైనా కన్నా నిత్యం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై వ్యక్తిగత విమర్శలు, దూషణలతో కాలం...

షర్మిల కాలు పెడితే.. వాళ్ల పునరుజ్జీవం సాధ్యమే!

వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయలను పూర్తిగా వదిలేశారు. తండ్రి జయంతి, వర్ధంతి లాంటి అరుదైన సందర్భాల్లో ఆయన సమాధి వద్ద నివాళి అర్పించడానికి తప్ప ఆమె ఏపీలో అడుగుకూడా...
Popular