అందుకే నేను ఆ సమయంలో..!

Sunday, June 23, 2024

కన్నడ సోయగం రష్మిక గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ హిట్‌ ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ…వరుస సినిమాలతో స్టార్ హీరోలందరి సరసన నటించింది. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా చేసింది.

పుష్ప సినిమా జాతీయ స్థాయిలో సూపర్ హిట్ కావడంతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది. ఈ భామకు బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా ఈ భామ బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో వరుసగా బడా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న పుష్ప 2 సినిమా ఆగస్టు 15 న గ్రాండ్ గా విడుదల కానుంది.

ప్రస్తుతం రష్మికకు నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.ఇదిలా ఉంటే తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న రష్మిక తెలుగులో మాట్లాడటంతో అర్ధం కానీ ఓ అభిమాని ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఎక్స్ ద్వారా రిక్వెస్ట్ చేసాడు. ఆ రిక్వెస్ట్ కు స్పందించిన రష్మిక .. సినిమా ఈవెంట్స్ లో ఇంగ్లీష్ లో మాట్లాడకపోవడానికి గల కారణాలను తాజాగా  తెలిపింది. ఎంతో మంది అభిమానులు నేను వారి భాషలో మాట్లాడాలని కోరుకుంటారు.అందుకే నాకు భాష రాకపోయినా కూడా మాట్లాడేందుకు ప్రయత్నిస్తాను.ఇంగ్లిష్ లో మాట్లాడి వారిని అగౌరవపరచాలని నేను అనుకున్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles