“లక్కీ భాస్కర్” టైటిల్ ట్రాక్ కి ముహుర్తం ఫిక్స్‌!

Monday, December 9, 2024

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మెయిన్‌ రోల్‌ లో, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న సినిమా లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం సినిమాతో తెలుగు ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కల్కి2898 ఏడీ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించి మెప్పించారు.

ఇప్పుడు ఈ లక్కీ భాస్కర్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ నెలకొంది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మరొక బ్యూటీ అయేషా ఖాన్ కూడా అలరించనుంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు.

ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ నే వచ్చింది. టైటిల్ ట్రాక్ ను జులై 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles