భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన మెగా పవర్‌ స్టార్‌!

Sunday, June 23, 2024

మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ , కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం గేమ్‌ ఛేంజర్‌. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలి ముఖ్య పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో సునీల్ ,నవీన్ చంద్ర ,ఎస్.జె సూర్య వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీ అవ్వడంతో రాంచరణ్ మూవీకి బ్రేక్ పడింది.ఇండియన్ 2 సినిమా రిలీజ్ కు సిద్ధం కావడంతో శంకర్ రాంచరణ్ మూవీతో బిజీ గా మారారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాలని శంకర్ అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా తరువాత రాంచరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన డైరెక్షన్ లో నటిస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడో లాంఛనంగా ప్రారంభం అయింది.

అయితే ఈ సినిమా కోసం రాంచరణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.చరణ్‌ ఈ మూవీకి ఏకంగా 125 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles