షూటింగ్‌ పూర్తయ్యింది!

Wednesday, January 8, 2025

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నటిస్తున్న తాజా సినిమా  ‘ఘాటి’ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. ఈ సినిమాలో అనుష్క పాత్ర మాస్ షేడ్స్‌తో ఉండబోతున్నట్లు ఈ వీడియో గ్లింప్స్ చూస్తే తెలిసిపోతుంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ ఒకటి బయటకు వచ్చింది.  ఈ సినిమా షూటింగ్‌ను మేకర్స్ తాజాగా పూర్తి చేసినట్లుగా సమాచారం.. షూటింగ్ పూర్తి కావడంతో ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా ముగించాలని చిత్ర యూనిట్ అనుకుంటుందంట.

ఈ సినిమాను దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంలో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles