తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప-2’కి భారీ టార్గెట్ ఫిక్స్‌!

Sunday, December 8, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్ తాజా సెన్సేషనల్‌ సినిమా ‘పుష్ప-2’ . మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తనదైన మార్క్‌ స్టైల్‌ తో తీర్చిదిద్దాడు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన అంచనాలు చూస్తుంటే, ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

అయితే, ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ టార్గెట్ ఏర్పడింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ‘పుష్ప-2’ బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే ఏకంగా రూ.212 కోట్ల మేర వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ టార్గెట్ అందుకోవాలంటే ‘పుష్ప-2’ టికెట్ రేట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి ఉంది.

మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ‘పుష్ప-2’ చిత్రానికి ఎంతమేర టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాయో వేచి చూడాల్సిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles