తెలుగు వారికి సాష్టాంగ నమస్కారం చేసిన ఫ్యామిలీ స్టార్‌ భామ!

Saturday, September 14, 2024

రౌడీ హీరో  విజయ్ దేవరకొండ హీరోగా , సీతారామం ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ఫ్యామిలీ స్టార్. తెలుగు సినీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పరశురాం పెట్ల దర్శకత్వంలో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. జనవరి నెలలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నప్పటికీ  పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

ఇక ఈ ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మృణాల్ ఠాకూర్ వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. స్పీచ్ మొదలుపెట్టే ముందే మీకు చిన్న చిన్న మాటలు చెప్పి మీరు ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను వర్ణించలేను అంటూ రెండు కాళ్ళ మీద కింద కూర్చుని సాష్టాంగ నమస్కారం చేసింది. మీ అందరికీ ధన్యవాదాలు, నాకు చాలా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.

మీరు నన్ను తెలుగమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఇక్కడ ఉన్నాను. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. మొదటి 15 రోజులు ఇబ్బంది అనిపించింది కానీ ఆ తర్వాత నేను పోషించిన ఇందు పాత్ర నాకన్నా ఎవరూ బాగా చేయలేరు అనిపించింది. ప్రతి హీరోయిన్‌ కూడా  విజయ్ లాంటి నటుడితో పని చేయాలి అనుకుంటుంది..  అలాంటి అవకాశం నాకు దక్కింది.

దిల్ రాజు గారితో ఇది రెండో సినిమా, మూడో సినిమా కూడా చేయాలి అని కోరుకుంటున్నా అని అన్నారు. గోపీ సుందర్ అందించిన సంగీతం వల్ల  నేను చాలా బాగా డాన్స్ చేయగలిగాను అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాను నా ఫ్యామిలీ స్టార్ మా నాన్నకి అంకితం చేస్తున్నాను అని అన్నారు. ఆ తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా సినిమాకు వెళ్లాలని మాట తీసుకుంది మృణాల్.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles