సూపర్‌ ఆఫర్‌ కొట్టేసిన కీర్తి సురేష్‌!

Monday, April 22, 2024

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాను ముందు నుంచి మే లో విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ దేశ వ్యాప్తంగా ఎలక్షన్స్‌ జరుగుతున్న తరుణంలో సినిమాను విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ప్రభాస్‌  రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

 కల్కి తర్వాత వస్తున్న సినిమాలల్లో స్పిరిట్ మూవీ  కోసం ఫ్యాన్స్ పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు..అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు సందీప్‌ వంగా.నిన్న కాక మొన్న వచ్చిన యానిమల్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ ను కొట్టాడు. దాంతో ప్రభాస్ తో  చేస్తున్న స్పిరిట్ మూవీ పై అభిమానులు ఓ రేంజ్ లో హైప్‌ పెంచుకుంటున్నారు. ఈ మూవీ రెబల్ స్టార్‌ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు.

సందీప్ వంగ గత రెండు సినిమాలు మాదిరి గానే..ఈ సినిమాలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీస్ నటించనున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా మరో పేరు వినిపిస్తుంది.. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా కీర్తి సురేష్ ను తీసుకోనున్నారని వార్త చక్కర్లు కొడుతున్నాయి.

 ఈ సినిమా షూటింగ్ ను ఈ సంవత్సరం చివర్లో మొదలు పెట్టనున్నారు. ప్రభాస్ కల్కి పనులు పూర్తి అయిన  తరువాత రాజాసాబ్ ని  పూర్తి చేసే  పని తీసుకోనున్నారు.  కీర్తి సురేష్‌ ఈ సినిమాలో నటిస్తే మాత్రం ఆమె ఖాతాలో మరో హిట్‌ పడినట్లే అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles