బిఆర్ఎస్ నేతలకు గాలం వేయడానికి భయపడుతున్న బిజెపి!

Thursday, May 2, 2024

తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్న బిజెపికి ఇప్పుడు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి సమర్థులైన అభ్యర్థుల కొరత ఎదురవుతుంది. అందుకనే అభ్యర్థులను ఇతర పార్టీల నుండి చేర్చుకునేందుకు ప్రణాళిక వేసుకొంది. మొన్నటి వరకు బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు, నాయకులపై దృష్టి పెట్టునా, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ నేతలపైననే వలవిసురుతున్నట్లు చెబుతున్నారు.

ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కీలక నేతలను ఇరికించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలతో బీజేపీ అధిష్ఠానం ఖంగుతిన్నది. అందుకనే ఆ పార్టీ నేతలజోలికి వెళ్లాలంటేనే వణికిపోతున్నది. అయితే అందుకు ఆ కేసు భయంతో కాదని, ఇప్పటికే అధికార పార్టీ ఎమ్యెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, వారిని చేర్చుకొని సీట్లు ఇచ్చినా గెలిచే అవకాశం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.

కానీ, వాస్తవం వేరే అని ఆ పార్టీ నేతలు విడిగా ఒప్పుకొంటున్నారు. ఎమ్యెల్యేల కొనుగోలు కేసుతో బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు సహితం ఇతర పార్టీల వారితో మాట్లాడడానికి భయపడుతున్నారని, తమపై కేసీఆర్ ప్రభుత్వం నిఘా కొనసాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. వారితో బేరసారాలు చేస్తే తామెక్కడ మరోసారి పట్టుబడతామో అని బిజెపి నేతలు సహితం వెనుకడుగు వేస్తున్నారు.

అందుకనే, ఇప్పుడు కాంగ్రెస్ నేతల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మొన్నటివరకు కాంగ్రెస్ ఉన్న నేతలు చాలామంది ప్రజలకు దూరమైనవారే అంటి కొట్టిపారేసిన బిజెపి నేతలు ఇప్పుడేమో వారి పట్ల ప్రజలలో `అయ్యో పాపం’ అనే సానుభూతి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే అంతర్గత సమస్యలు, విబేధాలు, వర్గపోరు కారణంగా కాంగ్రెస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు పలువురు బీజేపీ నాయకత్వంతో తమంతట తామే సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

బిఆర్ఎస్ నాయకులు తమకొద్దని అంటున్నప్పటికీ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటివారోస్తే చేర్చుకొంటామని స్పష్టం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles