మోడీ మోనార్క్ వైఖరికి ఇది నిదర్శనం!

Monday, April 22, 2024

విపక్షాల డిమాండ్ లను పాలక పక్షం ఎప్పుడూ కూడా పరిగణనలోకి తీసుకోదు, పట్టించుకోదు. సాధారణంగా ప్రతిపక్షాల డిమాండ్లు కూడా అలాగే ఉంటుంటాయి. కానీ సహేతుకమైన, తర్కబద్ధమైన డిమాండ్లు వినిపించినప్పుడైనా.. ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం అవసరం. కానీ, ఎవరు ఏం అనుకున్నా సరే, నేను చేయదలచుకున్నదే చేస్తా.. ఎవ్వరి అభ్యంతరాలనూ పట్టించుకోను.. అనే మోనార్క్ వైఖరితో దూసుకెళ్లడం మాత్రం ప్రధాని నరేంద్రమోడీకి చెల్లిన విద్య. ఇప్పుడు పార్లమెంటు నూతన భవనం ప్రారంబోత్సవానికి సిద్ధమవుతున్న సందర్భంగా ఆయన తన మోనార్క్ వైఖరిని మరోమారు ఘనంగా చాటుకుంటున్నారు.
పార్లమెంటు నూతన భవనం అనేది.. యావద్దేశపు ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రతిబింబం వంటిది గనుక దానిని ఒక పార్టీకి చెందిన, కేవలం ప్రభుత్వాధినేత అయిన ప్రధాని మోడీ ప్రారంభించకూడదని, రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని కాంగ్రెస్ సహా దాదాపు అన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సాంప్రదాయం ఎక్కడా లేదని కూడా అంటున్నాయి.
అయితే, ఇందుకు జవాబుగా మోడీ దళం చెబుతున్న సాకులు మరీ మొక్కుబడిగా ఉన్నాయి. గతంలో పార్లమెంటు అనుబంధభవాన్ని ఇందిర, పార్లమెంటు గ్రంథాలయాన్ని రాజీవ్ ప్రారంభించారు కదా.. ఇప్పుడు మాత్రం తప్పేమిటి అని అంటున్నారు. అలాంటి భవనాల ప్రారంభమూ, దేశం గర్వించే స్థాయి నూతన పార్లమెంటు భవన సముదాయం ప్రారంభమూ రెండూ ఒకటే అన్నట్టుగా బిజెపి వారు ఒకటే గాటన కట్టేస్తున్నారు. తమ మాటల్లో ఔచిత్యం లేదని వారు గ్రహించడం లేదు. అప్పట్లో ఇందిర, రాజీవ్ చేశారే అనుకుందాం.. నరేంద్ర మోడీ తనకు ఇందిర ఏమైనా రోల్ మోడల్ అనుకుంటున్నారా? ఆమె అడుగు జాడల్లో నడవాలని అనుకుంటున్నారా? అనేది ఇప్పుడు జనానికి కలుగుతున్న సందేహం.
రాష్ట్రపతిని ఆహ్వానించకుండానే ప్రధాని ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కాకుండా బహిష్కరించడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలు అన్నీ కలిసి కార్యక్రమానికి గైర్హాజరు కావాలనుకుంటున్నాయి. వారెవ్వరూ రాకపోయినా మోడీ పట్టించుకోరు. కేవలం తన పార్టీ నాయకులు, తన వందిమాగధులు, ప్రధానంగా మీడియా మాత్రం వస్తే చాలు. ఆయనకు ఇంకెవ్వరూ అక్కర్లేదు. ప్రతిపక్షాల బహిష్కరణ నిర్ణయాన్ని కూడా ఖాతరు చేయకుండా.. మోడీ తన మోనార్క్ వైఖరిని ప్రబలంగా చాటుకోబోతున్నారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles