వంశీ.. ఎన్నిసార్లు అడిగినా రిజల్ట్ మాత్రం ఇంతేనా?

Friday, December 5, 2025

మాజీ ఎమ్మెుల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగలింది. వివిధ కేసుల్లో నిందితుడుగా ప్రస్తుతం జుడిషియల్ రిమాండులో ఉన్న వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఆయన రెగులర్ బెయిలు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.  ఇదే కేసులో  ఆయన గతంలో విజయవాడ కోర్టులో బెయిలు పిటిషన్ వేయగా భంగపాటు తప్పలేదు. దాంతోర ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు పూర్తయి తీర్పును రిజర్వు చేసిన న్యాయస్థానం శుక్రవారం నాడు పిటిషన్ తిరస్కరించింది.

2023 ఫిబ్రవరి 20న గన్నవరం తెలుగుదేశం కార్యాలయం మీద వల్లభనేని వంశీ అనుచరులు దాడిచేశారు. కార్యాలయంలో విధ్వంసం సృష్టించి కంప్యూటర్లను పగులగొట్టారు. పలువురిని గాయపరిచారు. వాహనాలను తగులబెట్టారు.  ఈ కేసులో కూడా వంశీ అరెస్టు అయి రిమాండులో ఉన్నారు. అదే సమయంలో ఇదే పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటరు ఆపరేటరు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, నిర్బంధంలో ఉంచుకుని అతడితో కేసుకు వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇప్పించిన కేసులో కూడా వంశీ రిమాండులోనే ఉన్నారు. ఆయన పార్టీ ఆఫీసు మీద దాడికేసులో ప్రస్తుతం రెగులర్ బెయిలుకోసం పిటిషన్ వేయగా దానిని కోర్టు కొట్టేసింది. అయితే ఈ సందర్భంగా.. న్యాయమూర్తు చేసిన వ్యాఖ్యాలు చాలా కీలకమైనవి. వాటిని గమనిస్తే.వ.  మరెన్ని సార్లు ఆయన బెయిలు పిటిషన్ తో కోర్టు ఎదుటకు వెళ్లినప్పటికీ.. ఆయన కోరుకునే ఉపశమనం దక్కడం కష్టం అనే అభిప్రాయమే ఎవరికైనా కలుగుతుంది.

రికార్డులను పరిశీలించినప్పుడు.. సత్యవర్ధన్ ను వంశీ ఆయన అనుచరులు భయపెట్టి బలవంతంగా కోర్టుకు తీసుకువెళ్లి కేసును ఉపసంహరించుకునేలా చేసినట్టు స్పష్టమవుతోంది.. ఈ దశలో వంశీకి బెయిలిస్తే.. దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మళ్లీ ఇదే తరహా నేరానికి పాల్పడే అవకాశం కూడా ఉంది. వంశీకి బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. తారుమారు చేస్తారనే పోలీసుల వాదన సమర్థనీయంగా ఉంది. కాబట్టి బెయిలు పిటిషన్ కొట్టేస్తున్నాం అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
వంశీ తెదేపా ఆఫీసు మీద దాడికేసునుంచి తప్పించుకోడానికి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, నిర్బంధించి ఒక డ్రామా నడిపించారు. ముందుగా ఆ కిడ్నాపు కేసులోనే అరెస్టు అయిన వంశీ.. ఆ నేరం పూర్తిగా తేటతెల్లంగా నిరూపణ అవుతుండడం వల్ల.. మరే ఇతర కేసులోనూ బెయిలు పొందలేని దుస్థితికి చేరుకున్నారు. సాక్ష్యాలను తారుమారు చేయడంలో ఆయన చరిత్ర కోర్టు రికార్డుల్లోకి ఎక్కింది. ఏ కేసులో బెయిలు ఇచ్చినా.. ఇదే తరహాలో సాక్ష్యాలు మార్చేస్తారనే అనుమానాలు కోర్టుకు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వంశీ మరెన్ని సార్లు బెయిలు పిటిషన్ వేసినా సరే.. అనుకూల తీర్పు రావడం కష్టం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles