అన్న క్యాంటీన్ల ద్వారా గతిలేని నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగానే భోజనం అందించేలా ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అన్న క్యాంటీన్లలో అయిదు రూపాయలకు భోజనం అందిస్తున్నారు. అయితే త్వరలోనే ఈ భోజన పథకాన్ని ఉచితంగానే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం నాయకుడు గంటా శ్రీనివాసరావు కూడా త్వరలోనే ఈ ఏర్పాటు వస్తుందనే వాస్తవం చెప్పారు. ఈ ఉచిత పథకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. పేదవాడి ఆకలి తీర్చడం ఒక్కటే అంతిమలక్ష్యం అని సర్కారు భావిస్తోంది. దానికి అనుగుణంగానే అడుగులు వేస్తోంది.
పేదవాడి ఆకలి తీర్చడానికి చంద్రబాబునాయుడు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడే అన్న క్యాంటీన్ల వ్యవస్థను ప్రారంభించారు. అయితే గతిలేని వాడికి కడుపునింపడమే పాపం అన్నట్టుగా జగన్ తాను సీఎం అయిన వెంటనే ఈ పథకాన్ని అటకెక్కించేశారు. తటస్థులు, ఆయన మేలుకోరే అనేకమంది అన్న క్యాంటీన్లను కొనసాగించాల్సిందిగా సలహాలు ఇచ్చనప్పటికీ.. జగన్ ఖాతరు చేయలేదు. కనీసం అన్న బదులుగా రాజన్న పేరు పెట్టుకుని కంటిన్యూ చేయమని అంతా అడిగినా కూడా జగన్ పట్టించుకోలేదు.
అన్న క్యాంటీన్లను రూపురేఖల్లేకుండా చేశారు. తెలుగుదేశం నాయకులు తమ సొంత డబ్బుతో అయిదురూపాయల భోజనాలను చాలా చోట్ల ఏర్పాటుచేసినప్పటికీ.. వైసీపీ అరాచకశక్తులు వాటిని ఎక్కడికక్కడ ధ్వంసం చేసేశాయి. ఈ పాపాలన్నీ పండి జగన్ ఓడిపోయారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ తన బాధ్యతగా తీసుకున్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త సర్కారు మళ్లీ అన్న క్యాంటీన్ లను ప్రారంభించింది. అవి అద్భుతంగా నడుస్తున్నాయి. తొలినాళ్లలో కుట్రపూరిత దుష్ప్రచారంతో చెలరేగిన వైసీపీ మూకలు ఇప్పుడు పల్లెత్తు మాటాడ్డానికి అవకాశం లేక ఇరుక్కుంటున్నారు. అయిదు రూపాయలకు అన్న క్యాంటీన్ భోజనం చాలా సవ్యంగా అందుతోంది.
అయితే తమ ప్రభుత్వానికి ఇదే క్యాంటీన్ల ద్వారా పేదలకు ఉచితంగా ఆహారం అందించే ఆలోచన చేస్తున్నట్టుగా ఇప్పుడు ప్రకటనలు వస్తున్నాయి. అదే జరిగితే గనుక.. నిరుపేదల చంద్రబాబుకు నీరాజనాలు పడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా కొత్త శకానికి చంద్రబాబు సర్కారు శ్రీకారం చుడుతుందని ప్రజలు అంటున్నారు.