ప్రభుత్వాలు మారినప్పుడు పాత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన అధికార్లకు ఇబ్బందులు తప్పవు. కానీ వాళ్లు ఎన్నడూ కూడా.. ఉద్యోగం వదలి వెళ్లిపోరు. తర్వాత మళ్లీ ఏదో ఒక నాటికి తమ ప్రభుత్వం వస్తుందిలే అని ఎదురుచూస్తుంటారు. కానీ.. ఇప్పుడు ఏపీలో ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేస్తుండడం అనేక కొత్త సందేహాలను పుట్టిస్తోంది. నిజానికి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేయడం వెనుక అధికార కూటమి వేధింపులు ఉన్నాయని, వారు వేధించడం వల్లనే ఆయన ఏకంగా ఉద్యగానికి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని, అదంతా రెడ్ బుక్ వేధింపుల్లో భాగమని వైఎస్సార్ కాంగ్రెస్ రకరకాల తప్పుడు భాష్యాలు చెబుతోంది. కానీ.. వాస్తవ కారణాలు వేరే అని పలువురు భావిస్తున్నారు.
ఒక పార్టీకి అనుకూలమైన అధికారులు, మరో పార్టీ అధికారంలోకి వస్తే లూప్ లైన్లో పనిచేయవలసి రావడం అనేది చాలా సాధారణమైన విషయం. వేధింపులు అంటే అవి వేరే స్థాయిలో ఉంటాయి. అలా ఆరోపించడానికి తగినట్టుగా.. వైసీపీ జమానాలో జగన్ దోపిడీ పర్వానికి అడ్డగోలు మార్గాల్లో సహకరిస్తూ వచ్చిన అనేక మంది అధికారులు ఇప్పుడు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. అరెస్టులు కూడా అవుతున్నారు. రిమాండులో ఉంటూ.. బెయిలు మీద బయట తిరుగుతున్నారు. ఇలాంటి కేసులు వారి సర్వీసు మీద ప్రభావం చూపిస్తాయి. అలాంటి అనేక దృష్టాంతాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ కూడా.. ప్రజలెవ్వరూ వాటిని వేధింపులు అనుకోవడం లేదు. ఎందుకంటే.. జగన్ అనుకూల దందాలు సాగించడంలో వారు విచ్చలవిడిగా చేసిన పాపాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆ అధికారులెవ్వరూ వేధింపులకు గురవుతున్నట్టుగా ప్రజల్లో సానుభూతే రావడం లేదు. వారితో పోల్చుకుంటే.. వైసీపీతో అంటకాగిన సిద్ధార్థ్ కౌశల్.. డీజీపీ ఆఫీసులో అడ్మిన్ విభాగంలో ఉండడం అంటే చాలా గొప్ప హోదాలో ఉన్నట్టు లెక్క. ఎస్పీ లాంటి పోస్టుల్లో విచ్చలవిడి అధికారం చెలాయించడానికి, దోపిడీ చేయాలనుకునే వారికి ఆ అవకాశం ఉండదనే బాధ తప్ప మరొకటి లేదు.
కానీ అసలు విషయం ఏంటంటే.. సిద్ధార్థ్ కౌశల్ లో మళ్లీ వైఎస్సార్ సీపీ ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం సడలిపోయిందిట. తాను ఎప్పటికీ ఇలా లూప్ లైన్లోనే ఉండిపోవాల్సిందేమోనని భయపడ్డారని తెలుస్తోంది. దానికి తోడు మరో కారణం కూడా చెబుతున్నారు. ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా కూడా.. వారు చేసే ఒత్తిళ్లకు, దారితప్పి పనిచేయాల్సిందిగా చేసే డైరక్షన్ కు తగ్గట్టు నడుచుకోవాలంటే.. ఆత్మను చంపుకుని పనిచేయాల్సిందే అని భయపడుతున్నారంట. అందుకే ఈ తలనొప్పులన్నీ తనకు వద్దనుకుని.. అసలు ఐపీఎస్ పోస్టునే త్యజించి.. కార్పొరేట్ రంగంలోకి వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
కౌశల్ రాజీనామా వెనుక అసలు కారణం ఇదే
Monday, December 8, 2025
