వారందరూ పరారీలో ఉన్నారు! ఎందుకంటే..

Wednesday, January 22, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరాభిమానులు, జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు అనేకమంది ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా వారు ఇంట్లో లేరు. ఆఫీసులకు కూడా వెళ్లడం లేదు. ఇళ్లకు రావడం లేదు. ఎక్కడ ఉన్నారో, ఎటు వెళ్లారో ఎవ్వరికీ తెలియదు. ఫోన్లకు కూడా అందుబాటులో లేరు. అయినా వారి గురించి కుటుంబసభ్యులు పోలీసు కంప్లయింటు ఇవ్వడం లాంటివేమీ జరగడం లేదు. వారు మాత్రం నింపాదిగానే ఉన్నారు. మరి వారంతా ఏమైపోయినట్టు?

తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది గనుక.. ఇప్పుడు పెత్తనం వారిది గనుక.. ఇన్నాళ్లూ తాము సాగించిన దందాలకు అరాచకాలకు సమాధానంగా వారు తమ మీద విరుచుకు పడతారనే భయంతో వారు పరారయ్యారా? దాడుల జరుగుతాయని భయపడి మొహం చాటేశారా? వంటి అనుమానాలు పెట్టుకోకండి. వారు ఇళ్లు వదలి కొన్నాళ్ల పాటు పరారైన కారణం వేరే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వారంతా బెట్టింగులు కాశారు. తీరా ఫలితం తేడా కొట్టేసరికి అందరూ మొహం చాటేశారు. అప్పటికీ కొంతమందికి డబ్బులు చెల్లించినా.. తాహతుకు మించి పందేలు కాయడం వలన పరారైనట్లుగా తెలుస్తోంది.
జగన్ అభిమాని ఒకరు దాదాపు 30 కోట్ల రూపాయల మేరకు వైసీపీ గెలుపుపై పందేలు కాసి.. మొత్తం ఓడిపోయారని, పారిపోయారని వార్తలు వచ్చాయి. సంగతి తెలుసుకుని బెట్టింగులు కాసిన వారు.. ఇంటిమీద దాడిచేసి.. ఇంట్లోని విలువైన వస్తువులు అన్నీ అందినకాడికి పట్టుకుపోయినట్టు వార్తలొచ్చాయి. సంగతి తెలిసి సదరు 30 కోట్లు బెట్టింగుల్లో కోల్పోయిన జగన్ అభిమాని ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. జగన్ మీద ప్రేమ ఒక అమాయకుడిని బలి తీసుకుంది. ఈ వ్యక్తి తొలుత కొద్ది మొత్తాలనే బెట్టింగులు కాశారని, జగన్ ఐప్యాక్ వారి మీటిగులో 151కంటె ఎక్కువ గెలవబోతున్నాం అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత.. పెద్దమొత్తాలకు బెట్టిగులు కాసి చనిపోయాడని పలువురు అంటున్నారు. ఇది జగన్ చేసిన హత్య అని జనం అనుకుంటున్నారు.
ఆత్మహత్యలు చేసుకోలేని వాళ్లు, అలాగని బెట్టింగుల్లో ఓడిపోయిన వాళ్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరంతా తిరిగి ఎప్పటికి కోలుకుని తమ సొంత ఇళ్లకు వస్తారో.. జగన్ చెప్పే తరహాలో.. ఆ దేవుడికి మాత్రమే తెలుసు!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles