పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి రెడీ అవుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో, శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ పై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. కొంతకాలంగా వెనక్కి పోయిన షూటింగ్ చివరికి మళ్లీ ముమ్మరంగా మొదలయ్యింది.
ఇటీవలి రోజులలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి సినిమాల పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నాడు. జూన్ 10వ తేదీ నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ తిరిగి ప్రారంభమైందని సమాచారం. ప్రారంభ దశలో పవన్ లేని కొన్ని సీన్లను షూట్ చేస్తుండగా, ఆయన జూన్ 12 లేక 13 నాటికి సెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ దాదాపు ఒక నెలపాటు జరగనుంది. పూర్తి కమర్షియల్ టచ్ ఉన్న ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నది రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అన్ని పనులు ప్లాన్ ప్రకారమే జరిగితే, వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ కి ఎంతగానో కిక్ ఇస్తుందన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ మళ్లీ స్క్రీన్ మీద మాస్ ఫైర్‌గా రాబోతుందని టాక్.
