బాలీవుడ్‌ డెబ్యూ మూవీకి స్టార్‌ హీరోయిన్‌..కానీ!

Sunday, June 23, 2024

ఇండస్ట్రీ ఏదైనా చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తెలుగులో మంచి తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్‌.  ఈ ముద్దుగుమ్మ మలయాళంలో అనేక సూపర్‌ హిట్‌ సినిమాల్లో భాగమైంది.  తెలుగులోకి ఆమె చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఆమె మరొక స్టెప్ ముందుకేసేందుకు రెడీ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

వాస్తవానికి బాలీవుడ్ లో అడుగు పెట్టాలనే కోరిక ప్రతి సౌత్ హీరోయిన్ కు ఉంటుంది. అందుకే మన సౌత్ హీరోయిన్స్ అంతా హిందీలోని స్టార్ హీరోలతో సినిమా చేయాలని అనుకుంటారు. అయితే దీనికి భిన్నంగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు స్టార్ హీరోయిన్ సంయుక్త కూడా రెడీ అయింది. అదేమంటే ఆమె ఫస్ట్ హిందీ మూవీ స్టార్ బేస్డ్ కాదు, కంటెండ్ బేస్డ్ గా ఉండబోతోందట. ఈ సినిమాలో పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ లో సంయుక్త నటించనుందని టాక్ వినిపిస్తోంది.

కాజోల్, ప్రభుదేవా, నసీరుద్దీన్ షా ముఖ్యపాత్రల్లో  నటిస్తున్న ఈ సినిమాని తెలుగు దర్శకుడు చరణ్ తేజ్ రూపొందించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ కూడా చేయనున్నారు. అందరి కంటే భిన్నంగా బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయిన సంయుక్తా మీనన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనే వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles