ఇక నుంచి నన్ను అలా పిలుస్తారు చూడండి!

Sunday, December 8, 2024

గత కొంత కాలం ముందు వరకు కూడా పెళ్లి అయిన హీరోయిన్స్‌ కు అవకాశాలు పెద్దగా రావని…కానీ ఇప్పుడు ట్రెండ్‌ మారిందని.. పెళ్లయ్యాక కూడా కెరీర్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు’ అని స్టార్ హీరోయిన్‌ కాజల్‌ తెలిపింది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఈసినిమాకి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా  కాజల్‌ మీడియాతో మాట్లాడుతూ ‘నా నిజ జీవితంతో రిలేట్‌ చేసుకునే పాత్ర ఇది. సమాజంలో జరిగే సంఘటనలపై నేను తీవ్రంగా స్పందిస్తుంటా. పదే పదే వాటి గురించి ఆలోచిస్తుంటా. నా తరపున ఏమైనా చేయాలని తపిస్తాను. సత్యభామ పాత్ర కూడా అదే కోణంలో సాగుతుంది.ఈ సినిమాలో నేను పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తా. అందుకోసం ఫిట్‌నెస్‌ను పెంచుకోవడంతో పాటు యాక్షన్‌ ఘట్టాల కోసం ప్రిపేర్‌ అయ్యాను.

ఫైట్స్‌ రియాలిస్టిక్‌గా ఉంటాయి. గతంలో నేను ఓ సినిమాలో పోలీస్‌ క్యారెక్టర్‌ చేశాను. అయితే ఆ పాత్ర అంత సీరియస్‌గా కనిపించదు. ‘సత్యభామ’లో మాత్రం ఎమోషన్స్‌, యాక్షన్‌ సమపాళ్లలో ఉంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో అందరు నన్ను చందమామ అని పిలిచే వారు. ఇకనుంచి సత్యభామ అంటారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles