అక్కడ విడుదల అవుతున్న సలార్ సినిమా!

Saturday, May 18, 2024

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్ , కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్‌ లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పృథ్వీరాజ్ సుఖుమ్రాన్, జగపతి బాబు, శ్రేయా రెడ్డి, శృతిహాసన్, లాంటి యాక్టర్స్ ముఖ్య పాత్రలు పోషించిన ‘సలార్’ చిత్రం గతేడాది భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్‌లో విడుదలైన “సలార్” చిత్రం బాక్సాఫీస్ వద్ద 700 కోట్లను కొల్లగొట్టింది.

సలార్ పార్ట్ 2 ఉంటుందని ప్రకటించినప్పటి నుండి, సలార్ 2 పై చాలా అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి . ఇకపోతే తెలుగు సినిమాలకు జపాన్ లో కూడా మంచి మార్కెట్ ఉందని గత కొంత కాలంగా స్పష్టం అవుతుంది. మన తెలుగు హీరోలకి అక్కడ కూడా చాలా మాది అభిమానులున్నారు. బాహుబలి, సాహో, ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఎన్నో తెలుగు సినిమాలు జపాన్‌ లో అఖండ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

అసలు విషయం ఏంటంటే… సలార్ సినిమా త్వరలో  జపాన్‌ లో విడుదల కానుంది.  ప్రభాస్ కు జపాన్‌లో కూడా  అభిమానులు ఉన్నారు. గతంలో ప్రభాస్ పేరుతో పండగలు, ఆయన పేరు మీద షాపులు, ప్రభాస్ బొమ్మలు అమ్ముడుపోవడం చూశాం.. ప్రస్తుతం జపనీస్ భాషలో సలార్ సినిమా విడుదలకు ఆక్కడి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. జులై 14 నుంచి జపాన్ లో ‘సలార్’ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరి సలార్ గత చిత్రాల మాదిరిగానే జపాన్‌లో థియేటర్స్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles