సజ్జల: లోపల ఒకలా.. బయట ఇంకోలా..

Friday, December 5, 2025

అంతకంటె భిన్నంగా ఆయన మాట్లాడతారని అనుకోవడం కూడా అమాయకత్వమే అవుతుందేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సకల శాఖల మంత్రిగా చెలరేగిపోయిన సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఇప్పుడు పోలీసు విచారణలు ఎదుర్కోవల్సి వచ్చేసరికి.. మతిమరుపు రోగిలాగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు అడిగే దాదాపుగా అన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, నాకు సంబంధం లేదు.. వంటి సమాధానాలతోనే ఆయన నెట్టుకు వస్తుండడం గమనార్హం. తెలుగదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన కేసులో.. సజ్జల పాత్రను నిర్ధరించడానికి సీఐడీ పోలీసులు విచారణకు పిలిచారు. గంటకు పైగా పోలీసులు ఆయనను విచారించినప్పటికీ.. సజ్జల సూటిగా  ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పకపోవడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరగిన సందర్భంలో.. సజ్జల రామక్రిష్ణా రెడ్డి ఎలా మాట్లాడారో.. ఏం మాట్లాడారో  ఒకసారి అందరూ గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలో ఆయన తాడేపల్లిలో లేరు. దాడి జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తమ పార్టీ నాయకుడిని బూతులు తిడితే.. తమ పార్టీ కార్యకర్తలకు కోపం రాకుండా ఉంటుందా.. వారు వెళ్లి దాడి చేయకుండా ఉంటారా.. అని అర్థం వచ్చేలాగా ఆయన చాలా దుడుకుగా అప్పట్లో మాట్లాడారు. అంటే.. కేవలం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద మాత్రమే కాదు.. రాష్ట్రమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద వైసీపీ శ్రేణులు దాడులు చేయాల్సి ఉన్నదని.. అలా చేస్తేనే జగన్ ను తిట్టినందుకు సరైన జవాబు చెప్పినట్టు అవుతుందని.. రెచ్చగొట్టేలాగా ఆయన మాటలు ఉన్నాయనే విమర్శలు అప్పట్లో బాగా వినిపించాయి. అలాంటిది ఇప్పుడు మాత్రం సజ్జల రామక్రిష్ణారెడ్డి విచారణకు హాజరైనప్పుడు విచిత్రంగా మాట్లాడుతున్నారు.

పోలీసుల విచారణలో లోపల ఉన్నంత సేపు.. తనకు తెలియదు.. గుర్తులేదు వంటి సమాధానాలు చెప్పారు. దాడి సమయంలో తాను ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు చూపాలంటే దాట వేశారు. తీరా విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. మొత్తం తెలుగుదేశం పార్టీని, పోలీసులను కూడా బెదిరించే ధోరణిలో నర్మగర్భ వ్యాఖ్యలతో ఆయన మాట్లాడడం గమనార్హం.

విచారణ తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన సజ్జల రామక్రిష్ణారెడ్డి.. రాష్ట్రంలో అధికారం మారి వైసీపీ గద్దె ఎక్కిన తర్వాత మేం కూడా ఇదే మొదలు పెడితే పరిస్థితి ఏంటి? జగన్ ఇలా అనుకుని ఉంటే తెలుగుదేశం పార్టీనే ఉండేది కాదు.. అంటూ ఆయన బెదిరించారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తాం అని ఆయన హెచ్చరిస్తున్నట్టుగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. రాబోయే పరిణామాలకు చంద్రబాబు బాధ్యత వహించాలని అంటున్నారు. సజ్జల మాటలు ఇండైరక్టుగా పోలీసులను కూడా బెదిరించేలా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles