తారక్‌-నీల్‌ సినిమాకి ఓకే చెప్పిన రష్మిక!

Friday, December 6, 2024

టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో అగ్ర హీరోలందరితో నటించి బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది ఈ భామ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన గతేడాది పుష్ప సినిమాలో నటించి సూపర్‌ హిట్‌ ను తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బన్నీ పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా బాలీవుడ్‌ స్టార్‌ హీర్‌ సల్మాన్‌ ఖాన్‌ హీరోగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న సికిందర్‌ అనే సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్ కాంబోలో వస్తున్న ఎన్టీఆర్‌ 31 సినిమాలో నటించేందుకు రష్మిక ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ విషయం గురించి చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles