మరి సూపర్ స్టార్‌ కొడుకంటే ఆ మాత్రం ఉండాల్సిందే!

Saturday, July 20, 2024

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కుమారుడు గౌతమ్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్నతనంలోనే తండ్రి సినిమాలో నటించి మెప్పించాడు. దాంతో మహేష్‌ అభిమానులు గౌతమ్‌ సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గౌతమ్‌ లండన్ లో తన విద్యను అభ్యసిస్తున్నాడు.
ఈ క్రమంలోనే లండన్ లో గౌతమ్ తన ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడి ఫెర్పార్మెన్స్ కి అందరూ అలా ఫిదా అయ్యారట.

ఈ విషయాన్ని అతని తల్లి నమ్రత స్వయంగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. గౌతమ్‌ లండన్‌లో ఇచ్చిన తొలి ప్రదర్శన గురించి నమ్రత అభిమానులకు తెలియజేస్తూ సంతోషాన్ని  వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది.” గౌతమ్‌ ఫస్ట్‌ థియేటర్‌ స్టేజ్‌ పెర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. చూసిన వారంతా ఎంజాయ్‌ చేశారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ‘జాయ్‌ ఆఫ్‌ డ్రామా’ నిర్వహించే సమ్మర్‌ ప్రోగ్రామ్‌ ఎంతగానో బాగుంది. స్నేహితులు, కుటుంబంతో కలిసి ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది’” అంటూ గౌతమ్‌ గురించి, అతని స్టేజ్ ఫెర్ఫామెన్స్‌ గురించి రాసుకొచ్చింది.

ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఘట్టమనేని ఫ్యాన్స్  అయితే ఫుల్ ఖుషీ అవుతూ గౌతమ్ మూవీ ఎంట్రీ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నట్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా గౌతమ్ ఫస్ట్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ను చూసేందుకు మహేశ్‌ తో పాటు, సితార, నమ్రతా సోదరి శిల్పా శిరోద్కర్‌ కూడా లండన్ వెళ్లారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles