పుష్ప 2 సెకండ్‌ సాంగ్‌ ప్రొమో వచ్చేసింది!

Monday, June 24, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్, క్రియేటివ్‌ మాస్‌ డైరెక్టర్ సుకుమార్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమా పుష్ప సినిమాకి సీక్వెల్‌ గా తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ సింగల్ ను విడుదల చేసారు. ’పుష్ప పుష్ప’ అంటూ సాగె ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సాంగ్ విడుదల అయిన కొద్దీ సేపటికే రికార్డు వ్యూస్ తో దూసుకుపోయింది. ఈ సాంగ్ కు రాక్ స్టార్ దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ,అల్లుఅర్జున్ స్టెప్స్ హైలైట్ గా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ శ్రీవల్లి అనౌన్స్మెంట్ వీడియో గురువారం ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్‌ చేసారు.

సూసేటి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..అంటూ ఈ పాట సాగుతుంది. ఈ సాంగ్ లో శ్రీవల్లిగా రష్మిక తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకోంది. అయితే ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేసేది మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles