ప్రియదర్శి హీరోయిన్‌ నిహారిక!

Thursday, September 19, 2024

కమెడియన్‌ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన తరువాత హీరోలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో ప్రియదర్శి కూడా ఒకరు. మల్లేశం సినిమాతో హీరోగా మారిన తరువాత జాతి రత్నాలు, బలగం ఈ మధ్య వచ్చిన డార్లింగ్‌ అనే సినిమాలు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఆ సినిమా కోసం ఒక ఫేమస్ కంటెంట్ క్రియేటర్ హీరోయిన్ గా మారుతున్నట్లుగా సమాచారం. ఆమె ఇంకెవరో కాదు నిహారిక ఎన్ఎం. అమెరికాలో చదువుకున్న ఆమె తమిళనాడుకు చెందిన వ్యక్తి. అమెరికాలో చదువుకుంటున్న సమయంలోనే మంచి వీడియోలు చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

మేజర్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు, కేజిఎఫ్ విడుదల సమయంలో కూడా యష్ సహా పలువురు పెద్ద హీరోలతో కలిసి ఆ సినిమాలను ప్రమోట్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ మధ్య ఆమె పుట్టినరోజు సందర్భంగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ విడుదల చేసింది. అప్పుడే ఆమె ఏదో సినిమా చేస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

కానీ ఇప్పుడు ఆ సినిమా ఏమిటనేది క్లారిటీ వచ్చింది. ప్రియదర్శి హీరోగా నిహారిక హీరోయిన్ గా ఈ సినిమా రూపుదిద్దుకోబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.,

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles