వరుణ్‌ సినిమాలో వేణుస్వామి!

Monday, December 9, 2024

ప్రముఖ ఆస్ట్రాలజర్‌ వేణుస్వామి సినిమాల్లో కూడా నటిస్తాడా? అని షాక్‌ అవుతున్నారా…అంతలా ఏమి వద్దు. ఎందుకంటే వేణుస్వామి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన నటించలేదు కానీ ఆయనను పోలి ఉన్న ఒక పాత్రను సృష్టించి ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు డైరెక్టర్‌.

వరుణ్ సందేశ్ హీరోగా ఆద్యంత్ హర్ష అనే కొత్త దర్శకుడి డైరెక్షన్‌ లో విరాజి అనే సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ రామకృష్ణ అనే ఓ పాత్రను సృష్టించి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.  రఘు కారుమంచి నటించిన ఈ పాత్ర డిజైన్ చేసిన తీరు చూస్తే కచ్చితంగా అది వేణు స్వామిని ఆధారంగా చేసుకుని డిజైన్ చేసిన పాత్ర అని తెలిసిపోతుంది.

దీంతో వేణు స్వామి క్రేజ్ కేవలం సోషల్ మీడియా, మీడియాకే పరిమితం కాలేదని ఈ సినిమా ద్వారా తెలుస్తుంది.  ఏకంగా సినిమాల్లో పాత్రలు సృష్టించే వరకు వెళ్లిందంటనే అర్థం అవుతుంది. ఈ పాత్ర అనే కాదు ఈ మధ్యకాలంలో వేణు స్వామి మీద కౌంటర్లు వేస్తున్నామనే భావనలో చాలామంది దర్శకులు వేణు స్వామి లాంటి పాత్రలను సృష్టించి ఆయన మీద కౌంటర్లు వేస్తుననారు. ఇప్పుడు అదే కోవలో ఈ విరాజి డైరెక్టర్‌ అయితే ఏకంగా తన సినిమాలో ఓ పెద్ద పాత్రను సృష్టించడం గమనార్హం. ఇక ఈ సినిమాకి మంచి టాక్ కూడా వస్తుంది. నిడివి తక్కువ ఉండడం అయితే కాస్త సినిమాకి కలిసొచ్చిన అంశంలా అనిపిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles