బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన ప్రగ్యా …ఆ స్టార్‌ హీరోలో హీరయిన్‌ గా!

Wednesday, July 24, 2024

టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఆమె స్క్రీన్‌ పై కనిపించి సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది. నందమూరి నటసింహం బాలయ్య అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్ప సినిమాల్లో పెద్దగా ఎక్కడ ఈ భామ కనిపించింది లేదు.

 తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.. రెండేళ్ల నిరీక్షణకు ప్రతి ఫలం దొరికింది. బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది.అంతేకాకుండా ఈ  మూవీలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు సమాచారం.  తాప్సీ, వాణికపూర్‌తో  పాటుగా ప్రగ్యాజైస్వాల్ మరో హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.  ఈ మూవీలో ప్రగ్యాజైస్వాల్ నటిస్తోన్న విషయాన్ని మేకర్స్ స్వయంగా వెల్లడించారు.

ఖేల్ ఖేల్ మే మూవీని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ప 2కు పోటీగా ఈ సినిమా విడుదల కాబోతుంది.  దీంతో బాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి.  దాదాపు పదేళ్ల తర్వాత ఈ అమ్మడు మళ్ళీ బాలీవుడ్ లోకి తిరిగి ఎంట్రీ ఇస్తుంది. ఆమెకు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles