విశ్వంభర కోసం మరో టాలెంటెడ్ నటుడు!

Wednesday, July 24, 2024

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్గార్‌ చిరంజీవి బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను చేస్తూ బిజీగా ఉంటున్నారు. కుర్ర హీరోలకు పోటీని ఇచ్చేలా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. చిరంజీవి బింబిసార్‌ డైరెక్షన్‌ లో వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.. ఈ సినిమాలో చిరు యంగ్ లుక్ లో కనిపించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే న్యూస్ వినిపిస్తుంది. విశ్వంభరతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి దర్శకుడు వశిష్ట ఏదోక కొత్తదాన్ని పరిచయం చేస్తున్నాడు. విశ్వంభర బృందం ఇప్పుడు కమాండింగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని రంగంలోకి దిపింది.

ఈ సారి సినిమా బృందం బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ను రంగంలోకి దించింది. రంగ్ దే బసంతి, డాన్ 2, డియర్ జిందగీ మొదలైన అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించిన నటుడు విశ్వంభరలో పవర్ ఫుల్ పాత్ర కోసం ఎంపికయ్యాడు. మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.  తాజాగా అతని పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ సినిమా కోసం చిరు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. సినిమాలో డూప్ లేకుండా తానే యాక్షన్ సీన్లను చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. విశ్వంభర సినిమాలో త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles