విజయ్ కి పవర్‌ స్టార్‌ విషెస్‌!

Monday, October 28, 2024

కోలీవుడ్ ఇళయ దళపతి విజయ్ హీరోగా నటించిన తాజా సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా విడుదల అయ్యిన వెంటనే ఇప్పుడు మరో సినిమా కూడా విజయ్ మొదలు పెట్టేసాడు. అయితే ఈ సినిమా కాకుండా విజయ్ నుంచి ఒక సెన్సేషనల్ ఎంట్రీ కూడా ఇవ్వడం జరిగింది అలా నిన్న భారీ బహిరంగ సభ కూడా విజయ్ మొదటి సారిగా ఏర్పాటు చేశాడు.

అయితే ఆల్రెడీ కోలీవుడ్ సినిమాకి చెందిన సినీ ప్రముఖులు చాలా మందే శుభాకాంక్షలు తెలిపారు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ విజయ్ కి తన బెస్ట్ విషెస్ ని తెలియజేయడం అనేది వైరల్ అవుతుంది. తమిళ నాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తిరు విజయ్ అవల్ కి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. దీంతో ఇద్దరు హీరో/రాజకీయ నాయకుల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles