శాంతి మాట : సెలవుకోసం ఒక భర్త, ప్రెస్ మీట్ కోసం మరో భర్త!

Saturday, December 21, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో వివాహేతర సంబంధం ద్వారా కొడుకున్న కన్నట్టుగా భర్త ద్వారానే ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతంతో సస్పెన్షన్ లో ఉన్న ఆమె, తన నాలుగేళ్ల సర్వీసు కాలంలో సాగించిన అరాచక, అవినీతి కార్యకలాపాలమీద ప్రస్తుతం విచారణ జరగుతోంది. కాగా ఆమె మీద కొత్తగా కొన్ని అభియోగాలు మోపారు. కొన్ని విషయాల గురించి తక్షణం వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు.

శాంతికి గతంలో మదన్ మోహన్ తో వివాహం అయింది. వారికి కవల ఆడపిల్లలు కూడా ఉన్నారు. మదన్ మోహన్ అమెరికాకు వెళ్లి ఉన్న సమయంలో ఆమె గర్భం దాల్చి కొడుకును కన్నది. ఆ కొడుకు విజయసాయిరెడ్డి కి పుట్టాడంటూ భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. దీనిమీద రాద్ధాంతం నడుస్తోంది. ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ల అంతు తేలుస్తానంటూ ఒకవైపు విజయసాయిరెడ్డి రంకెలు వేస్తున్నారు. మరోవైపు శాంతి కన్నీళ్ల పర్యంతం అవుతోంది.
తనకు 2016లోనే భర్త మదన్ మోహన్ తో గిరిజన సాంప్రదాయం ప్రకారం విడాకులు అయ్యాయని, తర్వాత న్యాయవాది సుభాష్ రెడ్డిని పెళ్లిచేసుకున్నానని, బిడ్డకు తండ్రి కూడా అతడే అని శాంతి ఏడుస్తూ చెప్పింది.

సరిగ్గా ఈ పాయింటు దగ్గరే శాంతి పూర్తిగా ఇరుక్కుంది. ఇద్దరు భర్తలకు సంబంధించి ఆమె వెల్లడించిన వివరాలు, టైమ్  గురించి.. దేవాదాయ శాఖ అధికారులు నోటీసు ఇచ్చారు. 2020లో ఉద్యోగంలో చేరినప్పుడు శాంతి తన సర్వీస్ రిజిస్టర్ లో భర్తర పేరు మదన్ మోహన్ అని రాసినట్టుగా గుర్తించారు. 20234లో ప్రసూతి సెలవులకోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా.. భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నట్టుగా చెబుతున్నారు. వివాదం రేగిన తర్వాత ఈనెల 17 న ప్రెస్ మీట్ లో భర్త పేరు సుభాష్ అని చెప్పారని అంటున్నారు. విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోవడం ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. 15 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలి అని ఆదేశించారు.

నిజానికి 2020లో సర్వీసులో చేరిన శాంతి అప్పుడు మదన్ మోహన్ ను భర్తగా చూపించి, తీరా ఇప్పుడు 2016లోనే విడాకులు ఇచ్చేశాననడం కేవలం మోసం చేయడానికే చెప్పిన మాటగా అందరూ నమ్ముతున్నారు.

భర్త ఆరోపణలు చేయగానే ఆవేశంలో కన్నీళ్లతో ప్రెస్ మీట్ పెట్టిన శాంతి.. ఇప్పుడు శాఖపరమైన అభియోగాల్లో మరింత లోతుగా ఇరుక్కున్నారని అంతా అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles