ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వేతనాన్ని తన నియోజకవర్గ పరిధిలోని అనాధ పిల్లలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నుంచి తీసుకునే ప్రతి రూపాయి నియోజకవర్గ పరిధిలోని అనాథల సంక్షేమానికి వెచ్చించాలని ఆయన డిసైడ్ అయ్యారు. నిజానికి ఇది చాలా స్ఫూర్తిదాయకమైన, అనుసరణీయమైన విషయం. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరూ కూడా తమ తమ పరిధిలో ఇలాంటి సత్కార్యక్రమాలకు వేతనాన్ని వెచ్చిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తం అవుతున్నాయి.
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చే జీతాన్ని అక్కడే ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. తల్లిదండ్రులు లేని పిల్లల భవిష్యత్తు కోసం ప్రతినెలా జీతాన్ని కేటాయిస్తానని ఆయన ప్రకటించారు. నియోజకవర్గంలో 42 మంది అనాధ పిల్లలను ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరికి తన వేతనం నుంచి ప్రతినెలా 5000 రూపాయల వంతున మొత్తం 2 లక్షల పదివేల ఆర్థిక సాయం ప్రకటించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా అధికారుల ద్వారా వారి సంక్షేమం కోసమే వెచ్చించనున్నట్లుగా ఆయన చెప్పారు..
నిజానికి ఎమ్మెల్యేలు లక్షల రూపాయల వేతనాలు వస్తుంటాయి. అయితే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా జీతం మీద ఆధారపడి జీవనం సాగించే స్థితిలో లేరు అనేది అందరూ ఎరిగిన సంగతి. పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా కూడా కొనసాగుతున్నారు కనుక ఆ రూపంలో ఆయనకు లభించే సంపాదన భారీగానే ఉంటుంది కనుక ఆయన జీతాన్ని పేదల కోసం వెచ్చించిన చెల్లుతుందని వాదించడానికి అవకాశం లేదు. ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వరులు కుబేరులే అయి ఉంటారన్నది అందరికీ తెలుసు. అలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమ జీవితాన్ని తమ నియోజకవర్గం పరిధిలో ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిరుపేదల కోసం, అవసరంలో ఉండే ఆర్తుల కోసం వెచ్చించడం వారి పట్ల ప్రజలలో గౌరవాన్ని పెంచుతుంది. రాష్ట్రంలో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమ జీవితంలో ఇదే రూపంలో వెచ్చిస్తూ ఉంటారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనాధ పిల్లల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తమ పార్టీ అధినేత మార్గాన్నే అనుసరించబోతున్నట్లుగా తెలుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు అందరూ ఇదే తరహాలో తమ నియోజకవర్గాలలో పేదల కోసం జీతాన్ని కేటాయించబోతున్నట్లు పవన్ కళ్యాణ్ మార్గాన్ని అనుసరించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ బాట కేవలం జనసేన ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా మిగిలిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు కూడా అనుసరినీయం అయితే బాగుంటుందని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎందరు ఈ బాటలో నడుస్తారో వేచి చూడాలి.
పవన్ కళ్యాణ్ స్ఫూర్తి చాలా గొప్పది!
Friday, December 5, 2025
