కరపత్రిక దిగజారుడు రాతలు : ఇంత నీచంగానా?

Thursday, September 19, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్.. ముంబాయికి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీ ల మధ్య నడిచిన ప్రెవేటు వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ఈ వ్యవహారంలో కేవలం వారిద్దరు మాత్రమే కాదు.. కొందరు కీలకమైన పోలీసు అధికారులు, అంతకంటె కీలకమైన రాజకీయ నాయకులు కూడా ప్రజల నోళ్లలో నానుతున్నారు. కుక్కల విద్యాసాగర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. తమ నేతను కాపాడుకోవడానికి ఆ పార్టీ నానా పాట్లు పడుతోంది. పనిలో పనిగా ఆ పార్టీ కరపత్రిక కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. వారు ప్రత్యేకంగా కుక్కల వారితో ఒక ఇంటర్వ్యూ కూడా ప్రచురించారు.

సదరు ఇంటర్వ్యూ ప్రకారం.. విద్యాసాగర్ కేవలం రెండు మూడుసార్లు మాత్రమే కేవలం కాదంబరి జత్వానీతో మాట్లాడారట. అంతే.. పాపం ఆయనకు అంతకు మించి ఇంకేం తెలియదు. రెండు మూడుసార్లు మాట్లాడినందుకే నాలుగోసారి తనను పెళ్లి చేసుకోమని జత్వానీ ఆయనను అడిగిందిట. ఆమె మాత్రమే కాదు.. ఆమె తల్లి కూడా ఫోను చేసి అడిగారట. మరొకవైపు అదే కుక్కల విద్యాసాగర్.. తనకు 2009 ప్రాంతంలో ఆమె ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిందని, అవసరానికి డబ్బులు అడిగేదని చెబుతున్నారు. ఓ ప్రశ్నకు ఆయన ఆమె తరచుగా తనకు ఫోను చేసి డబ్బులు, ఫ్లయిట్ టికెట్లు అడిగేది అంటున్నారు. మరో ప్రశ్నకు అప్పుడప్పుడూ కలిసేవాడిని అంటున్నారు. లక్షలు కావాలి, కోట్లు కావాలి అని అడిగేదంటున్నారు. మరోసారి ఆమెతో ఫోటోలు దిగానని కూడా అంటున్నారు. అయితే తాను దిగిన ఫోటోలను అర్ధనగ్నంగా మార్ఫింగ్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత.. ఫైనల్ గా 2009 నుంచి వివాదం ముదిరి ఆమెను అరెస్టు చేసేదాకా రెండు మూడుసార్లు మాత్రమే మాట్లాడానని కూడా అంటున్నారు. ఇంత పొంతన లేని సమాధానాలు చెబుతున్న తమ నాయకుడి మాటలను, ప్రజలకు మరిన్ని కొత్త అనుమానాలు కలిగేలాగా ఆ పార్టీ కరపత్రిక ప్రచురించడం విశేషం.

అయితే తమ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ కడిగిన ముత్యం అని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ కరపత్రిక.. ముంబాయి నటి గురించి రాసిన రాతలు అత్యంత నీచంగా ఉన్నాయి. పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చేలా ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె కిలాడీ అని, అందం పెట్టుబడిగా హనీట్రాప్ బిజినెస్ చేస్తుందని, ప్రేమ వలవిసిరి తర్వాత వసూళ్లకు పాల్పడుతుందని, దోపిడీ గ్యాంగులతో, వ్యభిచార ముఠాలతో సంబంధాలు ఆమె డెయిలీ డ్యూటీ అని.. రకరకాల పిచ్చికూతలన్నీ ఆ కరపత్రికలో రాయడం నీచంగా ఉంది.

పార్టీ నాయకుడిని కాపాడుకునే ఉద్దేశంతోనే.. డైరక్టుగా పార్టీ పెద్దలు రంగంలోకి దిగి.. పోలీసు వ్యవస్థను పరుగులు పెట్టించి.. ఆమెను కుటుంబం సహా అరెస్టు చేయించారు. ఇప్పుడు విచారణ మొదలవుతోంది. పోలీసు అధికారుల సహా అందరి బాగోతాలు బయటకు వస్తాయి. ఈ కరపత్రిక ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి కారుకూతలతో తమ నేతలకు నకిలీ క్లీన్ చిట్ ఇవ్వగలదో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles