చిన్నమ్మ కంటె చంద్రన్న చెప్పిన మాట బెటర్!

Sunday, October 6, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్యూ కట్టి వలసలు వచ్చేయడానికి అక్కడి నాయకులు సిద్ధంగానే ఉన్నారు. అయితే.. వలసలు వచ్చే వారిని తమ పార్టీలో చేర్చుకునే విషయంలో కూటమి పార్టీల మధ్యనే పోటీ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది.  నిజానికి వైసీపీ నుంచి బయటకు వచ్చే వారికి కూటమిలోని మూడు పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరడం తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఎన్నికలకు ముందు.. షర్మిల సారథ్యంలోని కాంగ్రెసు వైపు ఒకరిద్దరు ఎటెంప్ట్ చేశారు గానీ.. అదెంత తప్పో వారికి తర్వాత తెలిసింది. ఆ నేపథ్యంలో అందరికీ ఇప్పుడు కూటమి పార్టీలు మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. కాకపోతే.. వైసీపీ నాయకులను చేర్చుకునే విషయంలో విధివిధానాల గురించి భాజపా రాష్ట్ర సారథి దగ్గుబాటి పురందేశ్వరి నిర్దేశించుకున్న ప్రమాణాల కంటె, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పాటిస్తున్న విధానం చాలా భేషుగ్గా ఉన్నదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

తమ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉన్నవారిని మాత్రమే చేర్చుకుంటాం అని దగ్గుబాటి పురందేశ్వరి.. చేరికలకు తాము పెట్టుకుని సింగిల్ పాయింట్ అర్హతను ప్రకటించారు. ‘తమ పార్టీ సిద్ధాంతాలు’  అంటే హిందూత్వ వాదానికి జైకొట్టడమే అనేది ఆమె ఉద్దేశం కావొచ్చు. అంతకు మించి నాయకులు ఎలాంటి వారైనా సరే.. పర్లేదన్నట్టుగా పురందేశ్వరి వ్యాఖ్యలు ధ్వనించాయి. దానికి తగ్గట్టుగానే అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లరు ఎర్ర గంగిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి కూడా ఆమె పచ్చజెండా ఊపారు. ఎర్రగంగిరెడ్డి భార్యతో సహా.. కండువా కప్పుకోడానికి సిద్ధమై బెజవాడకు వచ్చిన తర్వాత దానికి బ్రేకు పడింది. పార్టీనాయకుల్లోనే పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చిన్నమ్మ మాట మార్చారు.

కానీ చంద్రబాబునాయుడు తీరు వేరుగా ఉంది. ఆయన కూడా వైసీపీ నాయకులకు ఆహ్వానం పలుకుతున్నారు. నిజానికి ఇప్పుడు తమ తమ పదవులకు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు తెలుగుదేశంలోనే చేరుతారనే పుకారు ఉంది. అయితే చంద్రబాబు మాత్రం.. వైసీపీలో ఇమడలేక చాలా  మంది తమవైపు వస్తామని అంటున్నారని చంద్రబాబు చెప్పారు. అందరినీ కాకుండా.. మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటాం అని ఆయన తాము ఎంచుకున్న అర్హతను స్పష్టం చేశారు. అలాగే.. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది కలగకుండా కొత్తనేతల వలసలు ఉంటాయని కూడా ఆయన క్లారిటీ ఇస్తున్నారు.

పార్టీలో ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా ఇలాంటి ముందుజాగ్రత్తతో, వ్యక్తిత్వం ప్రాతిపదికగా జరిగితే అంతా మంచిగానే ఉంటుందని నాయకులు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles