పెళ్లికి ముందే తల్లి కాబోతున్న మిల్కీ బ్యూటీ!

Saturday, October 12, 2024

టాలీవుడ్‌ ముద్దుగుమ్మ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా వెబ్‌ సిరీస్‌ లు కూడా చేస్తూ ఈ అమ్మడు క్షణం తీరిక లేకుండా ఉంటుంది. టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది.

 ముఖ్యంగా బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. గతేడాది జైలర్, లస్ట్ స్టోరీస్‌ అనే వెబ్ సిరీస్ చేసి విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు బాక్, ఓదెల-2 వంటి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే తమన్నా  వ్యక్తిగత జీవితానికి వస్తే… ఈ అమ్మడు నటుడు విజయ్ వర్మతో గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

తొందరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ కెమెరాకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, తమన్నా భాటియాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది. పెళ్లికి ముందే ఆమె తల్లి కాబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తమన్న-విజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ఓ విషయం షికారు చేస్తుంది.

 పెళ్లి కి ముందే ఓ బిడ్డను కణాలని వీరిద్దరూ  డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఓ బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని బాధ్యతలు తెలుస్తాయని వీరిద్దరూ అనుకుంటున్నారంట. ఈ విషయం బయటకు రావడంతో అది తెలుసుకున్న నెటిజన్లు పెళ్లి కాకముందే తల్లిదండ్రులు కావాలని అనుకోవడం ఏంటని? చర్చించుకుంటున్నారు.

ఇందులో నిజమెంత ఉందనేది తెలియనప్పటికీ ప్రస్తుతం తమన్నా భాటియా వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఫ్యాన్స్ మాత్రం వాటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. ఆమె వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడమేంటని ఫైర్ అవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles