వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్‌!

Sunday, June 16, 2024

టాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ప్రేక్షకులను ఆకట్టుకులేకపోయాడు.  దీంతో వెంకటేష్ తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యాడు. వెంకటేష్ కు ఎఫ్2,ఎఫ్ 3 వంటి సూపర్‌  హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను త్వరలోనే తెరకెక్కించనున్నాడు.  ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా తెరకెక్కుతుంది. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది .వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమాలో మరో హీరోకి ఛాన్స్ ఉందట. గతంలో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన వెంకటేష్ ఈసారి మంచు మనోజ్ తో స్క్రీన్ పంచుకోనున్నట్లు  తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో మనోజ్ ఎలాంటి పాత్ర చేయనున్నాడో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ రాకింగ్ స్టార్ గా గుర్తింపు పొందిన మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా  కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న “మిరాయ్” సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో మనోజ్ వెంకటేష్ మూవీలో  కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles