టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా పూర్తి మైథలాజికల్ చిత్రంగా ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండటంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక తాజాగా ఈ సినిమాలోని ‘లవ్ సాంగ్’ను మేకర్స్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ చిత్రం అయినప్పటికీ, ఇందులో ప్రేమ, యాక్షన్‌కు మంచి స్కోప్ ఉంది. దీంతో ఈ సినిమాలో ఉన్న లవ్ సాంగ్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాట మెలోడీగా సాగుతుండటంతో స్లోగా ఆడియెన్స్‌కు నచ్చుతుంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా స్టీఫెన్ దేవస్సి చక్కటి ట్యూన్స్ కంపోజ్ చేశారు.
ఈ సినిమాలో విష్ణు మంచు తిన్నడు పాత్రలో నటిస్తుండగా అందాల భామ ప్రీతి ముకుందన్ నెమలి అనే పాత్రలో నటిస్తుంది. వారి మధ్య వచ్చే ఈ రొమాంటిక్ ట్రాక్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.