హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తీసిన సెన్సెషనల్ హిట్ మూవీ ‘అవతార్’ .ఈ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమలో ఓ సంచలనం. మరి అలాంటి గొప్ప సినిమాలో అవకాశం ఇస్తానంటే ఏ యాక్టర్ అయినా అయినా వదులుకుంటారా..?, కానీ బాలీవుడ్ నటుడు గోవింద ‘అవతార్’ అవకాశాన్ని తిరస్కరించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోవింద అవతార్ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇంతకీ, ఆయన ఏం అన్నారంటే. ‘అమెరికాలో ఉన్న సర్దార్ కు నేను బిజినెస్ సలహా ఇచ్చాను. అది బాగా క్లిక్ అయ్యింది. దాంతో, అతడు నన్ను జేమ్స్ కామెరూన్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ దిగ్గజ దర్శకుడితో నేను డిన్నర్ చేశాను. అప్పుడే, ఆయన నాకు ‘అవతార్’లో ఓ పాత్ర గురించి తెలిపారు.
నిజానికి, ఆ అవకాశం గురించి నాకు చాలా బాగా వివరించారు. ఇంతకీ, ఆ సినిమాలో కీలకమైన ‘స్పైడర్’ పాత్రలో తనని నటించమని అడిగారంట. పైగా రూ.18 కోట్లు పారితోషికం కూడా ఇస్తామని ఆఫర్ చేశారంట. కాకపోతే, 410 రోజులు షూటింగ్ ఉంటుందని చెప్పారు. నేను కూడా ఆ సమయంలో ఓకే అన్నాను. కానీ, శరీరానికి పెయింట్ వేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. దీంతో, ఆ ఆఫర్ ను నేను వదులుకున్నాను. ఆ తర్వాత ఆ పాత్రలో నటించిన నటుడిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన అంత గొప్పగా నటించాడు’ అని గోవింద తెలిపారు.