లీకైన కల్కి సెకండ్‌ ట్రైలర్‌!

Tuesday, January 21, 2025

కల్కి 2898 ఏడీ ఈ సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో సినిమా గురించి భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా తెగ వైరల్ అవుతోంది.ముంబైలో బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె సహా నిర్మాత అశ్వినీదత్ కూడా హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియాకి కల్కి సెకండ్ ట్రైలర్‌ను చిత్ర బృందం చూపించింది.

కానీ ఇది బయటికి రాకుండా ఫోన్లలో ఎవరూ రికార్డ్ చేయకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంది. కానీ సోషల్ మీడియాలో ఈ సెకండ్ ట్రైలర్ లీక్ అయిపోయింది. ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఈ సెకండ్‌ ట్రైలర్‌కి సంబంధించిన వీడియోల్లో విజువల్స్ మాములుగా లేవు. ముఖ్యంగా ఫస్ట్ ట్రైలర్‌లో ఎక్కడా చూపించని కొన్ని సీన్లు, కొత్త క్యారెక్టర్లు ఇందులో కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సెకండ్ ట్రైలర్‌లో మెరిసింది. మృణాల్ కడుపులోకి ఒక లైట్ దూసుకొస్తున్న విజువల్ చూడటానికి అదిరిందంతే. ఈ సీన్ చూస్తుంటే మృణాల్.. మహాభారతంలోని ‘ఉత్తర’ పాత్రను పోషించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అశ్వత్థామ తాను సంధించిన బ్రహ్మాస్త్రాన్ని ఉత్తర గర్భం వైపు మళ్లీస్తాడు… కనుక ఇది ఆ సన్నివేశమే అయి ఉంటుందని తెలుస్తుంది.

 కానీ మరికొంతమంది అయితే మృణాల్.. కల్కి తల్లి అయిన సుమతి పాత్ర పోషించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ట్రైలర్‌లో మరో హైలెట్ సీన్ అశ్వత్థామ-భైరవ మధ్య జరిగే పోరాట సన్నివేశాలే అని చెప్పుకోవచ్చు. ఈ సెకండ్ ట్రైలర్‌లో వీళ్ల మధ్య జరిగిన యాక్షన్ సీన్స్ చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారెంటీ. ఇక కమల్ హాసన్, దీపిక పదుకొణె సీన్లు కూడా చాలానే ఉన్నాయి. మొత్తానికి సెకండ్ ట్రైలర్ మాత్రం ఫస్ట్ దాని కంటే కచ్చితంగా అంతకుమించి అనేలా ఉంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles