ప్రజలు తనను ఓడించారనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి జీర్ణం చేసుకోలేకపోతున్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి నాయకుడిగా, తనను కూడా కేవలం సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే అయిదేళ్లు జీవించాల్సిందిగా రాష్ట్ర ప్రజలు విస్పష్టమైన తీర్పు చెప్పిన సంగతి ఆయన బుర్రలోకి వెళ్లడం లేదు. ఆయన తాను ఇంకా మోనార్క్ ను అనే భ్రమల్లోనే ఉన్నారని, అందుకే తన స్థాయి హోదా లగురించి కోర్టుల్లో పిటిషన్లు వేసుకుంటున్నారని ప్రజలు అనుకుంటున్నారు. తనకు జూన్ 3వ తేదీ నాటికి ఉన్న భద్రతను పునరుద్ధరించాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడం అనేది ఇప్పుడు ప్రజల్లో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
జగన్ ఇప్పుడు కేవలం సాధారణ ఎమ్మెల్యేనే అయినప్పటికీ.. ఆయనకు జడ్ ప్లస్ భద్రత కొనసాగుతోంది. అది చాలదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏ వైభవం అయితే అనుభవించారో.. అదే వైభవం కావాలని జగన్ కోరుకోవడం జనానికి నవ్వు తెప్పిస్తోంది.
ఇప్పుడు నాయకులు అందరూ కూడా.. జగన్ వేసిన పిటిషన్ గురించే మాట్లాడుతున్నారు. జడ్ ప్లస్ ఉన్నా కూడా చాలదంటే ఎలా? అని లోకేష్ అంటోంటే.. జగన్మోహన్ రెడ్డి సీఎం స్థాయి భద్రత కోసం పట్టుబడుతున్నారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేస్తున్నారు. నిజానికి గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఈ స్థాయి భద్రత ఏర్పాట్లను అనుభవించలేదు. జగన్ తాను సీఎంగా ఒక ప్రత్యేకచట్టం తయారుచేసి మరీ, తనకు తన కుటుంబసభ్యులకు కూడా అపరిమితమైన భద్రతను ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ 980 మంది సిబ్బంది తన సెక్యూరిటీ వ్యవస్థను మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత.. అదంతా అలాగే కొనసాగాలని అడుగుతున్నారు. జగన్ భద్రతకు ఏటా 90 కోట్లరూపాయల ఖర్చు అవసరమా అంటూ ఎమ్మెల్యే రఘురామక్రిష్ణ రాజు కూడా ప్రశ్నిస్తున్నారు.
కాగా, జగన్ తన భద్రత గురించి కోర్టులో పిటిషన్ వేయడం ఆ పార్టీ వారికి కూడా నచ్చడం లేదు. అనవసరమైన విషయాల గురించి రాద్ధాంతం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో మరింతగా పలుచన అవుతున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కోర్టులో నిలిచే కేసు కాదని.. ఆ తర్వాత సుప్రీం కోర్టులో కూడా కేసును కొనసాగించి.. జగన్ తన పరువు తానే తీసుకుంటారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక సాధారణ ఎమ్మెల్యేకు మించి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు కల్పిస్తున్న భద్రత ఏర్పాట్లను ఎవ్వరూ తప్పుపట్టలేరని అంటున్నారు. ప్రజల గురించి పిటిషన్లు వేయడం కాకుండా.. జగన్ తన గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారని కూడా పలువురు పేర్కొనడం విశేషం.
కామెడీగా కనిపిస్తున్న జగన్ భద్రత డిమాండ్!
Sunday, December 22, 2024