ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఆ ప్రాంతంలో కాకపుట్టిస్తున్నాయి. స్థానిక సంస్థల ఓట్లలో మెజారిటీ కలిగిఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఆల్రెడీ తమ అభ్యర్థిని ప్రకటించేసింది. చీపురుపల్లినుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన బొత్స సత్యనారాయణ వైసీపీ తరఫున ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. తెలుగుదేశం, కూటమి పార్టీలు తమ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇంకా కసరత్తు జరుగుతోంది. అయితే.. జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణ పదవిలో ఉండగా అక్రమార్జనల ద్వారా సంపాదించుకున్న సొమ్ములకు గండికొట్టడానికే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని స్థానికంగా ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజికవర్గం బలంగా ఉంటుంది. నిజానికి స్థానిక సంస్థల ఓటర్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం దండిగానే ఉంది. అలాంటి పరిస్థితుల్లో జగన్ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా సరే.. వారు గెలిచి తీరాలి. కానీ, అలా గెలుస్తారనే నమ్మకం జగన్ కు లేకుండాపోయింది.
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి, పార్టీ భవిష్యత్తు కూడా ఆశావహంగా కనిపించకపోవడం నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఓటర్లు అయిన స్థానిక సంస్థల ప్రతినిధులు తమ దారి తాము చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వారంతా కూటమి పార్టీల్లోకి జంప్ చేయడానికి మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో సొంత పార్టీ తరఫున గతంలో గెలిచిన వారే అయినప్పటికీ.. వారితో ఓట్లు వేయించుకోవడం తలకు మించిన భారమే. ఎన్డీయే కూటమి చేతిలో అధికారం ఉన్నది గనుక.. స్థానిక ప్రతినిధులు అటు మొగ్గడం ఆశ్చర్యం కాదు. అధికార పక్షంతో మంచిగా ఉంటే తమ ప్రాంతాల్లో పనులు జరుగుతాయని వారు ఆశపడతారు. అలాంటి వారిని మభ్యపెట్టి తమకు ఓట్లు వేయించుకోవాలంటే.. వారికి భారీగా ప్రలోభాలు అవసరం అని జగన్ లెక్క. బొత్స సత్యనారాయణ అయితే.. భారీగా డబ్బు ఖర్చు పెట్టి.. స్థానిక ప్రతినిధులకు భారీ తాయిలాలు ఇచ్చి వారు ఫిరాయించకుండా చూసుకోగలరని, ఓట్లు వేయించుకోగలరనే అంచనాతో టికెట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈ ఎన్నిక వల్ల బొత్స ఖజానాకు భారీగానే గండిపడుతుందని, ఇంతా చేసి ఒకవేళ గెలిచినా కూడా.. అధికారంలో తెలుగుదేశం ఉండగా, ఎమ్మెల్సీ పదవి ద్వారా బొత్స సాధించేదేమీ ఉండదని కూడా పలువురు అనుకుంటున్నారు. ఇటీవలి ఎన్నికల్లో చీపురుపల్లిలో బొత్సతోపాటు, విశాఖ ఎంపీగా ఆయన భార్య బొత్స ఝాన్సీ బరిలోకి దిగడం వల్ల.. భారీగా ఖర్చు పెట్టి నష్టపోయారని, ఇప్పుడు మళ్లీ ఆర్థిక భారం తప్పదని అనుకుంటున్నారు.
బొత్స ఖజానాకు గండి పడక తప్పదు!
Thursday, October 3, 2024