‘పూర్’ జగన్ ప్రయాణం ఖర్చు గంటకు 12.5 లక్ష్లలు!

Monday, June 17, 2024

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పూర్ క్లాస్ కు చెందిన వ్యక్తి! తాను పూర్ క్లాస్ ప్రతినిధిని అని ఆయన స్వయంగా చెప్పుకుంటూ ఉంటారు. రాబోయే ఏడాది ఎన్నికల్లో మన రాష్ట్రంలోర జరగబోయేది కాస్ట్ వార్ కానే కాదని, క్లాస్ వార్ అని జగన్ ప్రతి సభలోనూ తనదైన శైలిలో చెబుతుంటారు. పేదలకు, పెత్తందార్లకు జరుగుతున్న పోరాటం అని అభివర్ణిస్తారు. తన వద్ద తన ప్రత్యర్థుల మాదిరిగా డబ్బు లేదని, తాను పేదల ప్రతినిధిని అని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి చెబుతున్నారు గనుక.. అదంతా నిజమే అని అనుకోవాలి. మరి అలాంటి పూర్ క్లాస్ కు చెందిన జగన్మోహన్ రెడ్డి, సతీ సమేతంగా లండన్ కాలేజీలో చదువుకుంటున్న కూతురి వద్దకు విహార యాత్రకు వెళ్లారు. ఆయన ప్రయాణం ఖర్చు వివరాలు తెలిస్తే.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదలందరికీ ఛాతీ ఉప్పొంగి , నాలుగు అంగుళాలు పెరుగుతుంది. అవును మరి.. ఆ ఖర్చు అంత ఉంది.

జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా సుమారు 19 మంది మాత్రమే ప్రయాణించగల ఒక విమానాన్ని అద్దెకు తీసుకుని (చార్టర్డ్) లండన్ వెళ్లారు. ఆ విమానం పేరు ఎంబ్రాయెర్ లినేజ్ 1000. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన ఖరీదైన చార్టర్డ్ విమానాల్లో అది కూడా ఒకటి. ఆ విమానంలో ప్రయాణించాలంటే ఒక గంటకు చెల్లించాల్సిన మొత్తం కేవలం 14,850 డాలర్లు. అంటే గంటలకు సుమారు 12.5 లక్షలు అనుకోవచ్చు. మన బెజవాడ నుంచి లండన్ దాకా వెళ్లాలంటే కనీసం 11 గంటలు పడుతుంది. దానికి కాగల ఖర్చు సుమారుగా 1.4 కోట్లు అన్నమాట. మళ్లీ లండన్ నుంచి తిరిగి బెజవాడ రావడాన్ని కూడా లెక్క వేస్తే.. దీనికి రెట్టింపుగా 2.8 కోట్లు అవుతుంది.

పూర్ క్లాస్ ప్రతినిధి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాను పదిరోజుల పర్యటనలో కూడా అదే విమానం వాడుకోదలచుకుని.. తిరుగు ప్రయాణం వరకు దానిని తనతోనే ఉంచుకోదలచుకుంటే.. దాని పార్కింగ్ తదితర ఖర్చులు ఇంకా తడిసి మోపెడు అవుతాయి. వెరసి మొత్తం అయిదారు కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదు.

మరి ఈ కబురు రాష్ట్రంలోని పేదలందరూ కూడా గర్వించాల్సిన సంగతేనా కాదు. తమ పేదలందరికీ ప్రతినిధి అయిన జగన్మోహన్ రెడ్డి.. అయిదారు కోట్ల రూపాయల ఖర్చుతో కూతురును చూసి రావడానికి వెళ్లివచ్చారంటే.. పేదల స్థాయి ఎంతగా పెరిగినట్టు? పేదలు ఈ స్థాయిలో బతుకుతున్నందుకు.. తతిమ్మా పేదలందరూ మురిసిపోవాల్సిందేనేమో అని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles