బర్త్‌ డే గిఫ్ట్‌ అదేనా!

Wednesday, January 22, 2025

‘గుంటూరు కారం’ త‌ర‌వాత మ‌హేష్‌బాబు సినిమాల‌కు సంబంధించిన విష‌యాలేం ఇప్పటి వరకు బ‌య‌ట‌కు రాలేదు. రాజ‌మౌళి సినిమా ఒకటి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నట్లు మాత్రం ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే. రాజమౌళితో సినిమా అంటే… ఫ్యాన్స్ ఏళ్ల‌కు ఏళ్లు ఎదురుచూపుల్లోనే మ‌గ్గాలి. సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పుడు ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది? అనే విష‌యాల్లో రాజ‌మౌళి నుంచి ఎలాంటి అప్ డేటూ ఇప్పటి వరకులేదు. ఈ సినిమా టైటిల్ విష‌యంలోనూ ఇప్పటికే చాలా రూమర్లు బయటకు వస్తున్నాయి.

మ‌హేష్ బాబు త‌ప్ప మ‌రో స్టార్ కాస్టింగ్ ని చిత్ర‌బృందం ఇప్పటి వరకు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క‌టి.. ఒక్క‌టంటే ఒక్క అప్ డేట్ కూడా బయటకు రాలేదు. దీంతో ఈ విషయంలో  మ‌హేష్ అభిమానుల్లో అసంతృప్తి రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే ఈ నిరీక్ష‌ణ‌కు ఆగ‌స్టు 9తో తెర‌ప‌డ‌డం మాత్రం గ్యారంటీ అని తెలుస్తుంది. ఎదుకంటే ఆరోజు మ‌హేష్ పుట్టిన రోజు.

ఈ సంద‌ర్భంగా మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాకు సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ చిత్ర బృందం నుంచి రావ‌డం ప‌క్కా అని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి రాజ‌మౌళి ఓ కాన్సెప్ట్ వీడియో విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాల్లో బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆ కాన్సెప్ట్ వీడియోని విడుద‌ల చేసి, ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్ర‌క‌టించాల‌ని రాజ‌మౌళి అనుకుంటున్నారు. దానికి ఆగ‌స్టు 9 ముహూర్తంగా నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

సాధార‌ణంగా రాజ‌మౌళి కొత్త సినిమా ప్రారంభిస్తున్నప్పుడు మీడియాతో సినిమా గురించి చెప్పడం,   సినిమాకు సంబంధించిన కీల‌క‌మైన వివ‌రాలు పంచుకోవ‌డం అల‌వాటు. ఆగ‌స్టు 9కి ముందే.. ఆ మీడియా స‌మావేశం ఏర్పాటు చేస్తార‌ని, అయితే కాన్సెప్ట్ వీడియో మాత్రం ఆగ‌స్టు 9న విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి మ‌హేష్ పుట్టిన రోజుకు మాత్రం మంచి స‌ర్‌ప్రైజే ప్లాన్ చేశాడు జ‌క్క‌న్న‌.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles