మోక్షజ్ఙ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌…ఈ ఏడాదే అభిమానుల ముందుకు!

Saturday, July 20, 2024

నందమూరి నటసింహం బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఙ సినీ ఎంట్రీ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఓ పోస్ట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.  కానీ డైరెక్టర్, హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తను స్లిమ్‌గా అదిరిపోయే లుక్స్‌లో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. దీంతో అంతా ఎన్టీఆర్ అంత పాపులారిటీ దక్కించుకుంటాడని కామెంట్లు పెట్టారు.

ఇక తాజాగా, మోక్షజ్ఞ తాను ఏ డైరెక్టర్‌తో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడో ప్రకటించి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇటీవల హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో మోక్షు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘‘ఈ సంవత్సరం బాలయ్య- NBK 109, ఎన్టీఆర్ – దేవర, మోక్షు – అరంగేట్రం, నందమూరి నామ సంవత్సరం’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఒకే సంవత్సరం నందమూరి ఇంటి నుంచి మూడు సినిమాలు రాబోతుండటంతో అభిమానుల  ఆనందానికి అంతే లేదు. నెట్టింట పలు పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అయితే హీరోయిన్‌గా టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలను తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. దానికి బాలయ్య ఈ అమ్మడుని ముందే ఒప్పించారని సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం సూపర్ అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles