జగన్ భక్తులు తిష్టవేసి ఉంటే.. ఈ అరాచకత్వమే కదా?

Thursday, January 23, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంట్రాక్టు పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకూడదని ఎవరూ అనరు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనులు చేసిన వారికి అయిదేళ్ల పాలన కాలం పొడవునా బిల్లులు ఇవ్వకుండా వేధించారో.. అదే తప్పు చంద్రబాబు కూడా చేయాలని ఎవ్వరూ కోరుకోరు. కానీ.. ఆరేడేళ్ల ముందు పనులు చేసిన వారికి ఇప్పటిదాకా బిల్లులు ఇవ్వకుండా, జగన్ పార్టీకి చెందిన వారికి, మొన్నమొన్ననే పనులుచేసిన వారికి దాదాపు వంద కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేయడం ఇప్పుడు సంచలనం అవుతోంది. ఆర్థిక శాఖ వంటి కీలక విభాగాల్లో ఇంకా జగన్ వీరభక్తులే తిష్టవేసుకుని కూర్చుని ఉండగా.. ఇలా కాకుండా మరెలా జరుగుతుందని నాయకులు ప్రశ్నిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. అదీ ఇదీ అని తేడా లేకుండా దాదాపు అన్ని కీలక విభాగాల్లోనూ తనకు అత్యంత వీర విధేయులైన అధికారుల్ని, సిబ్బందిని తెచ్చి  నియమించుకున్నారు. అందరూ జగన్ కు వీరభక్తులు! ఆయన కళ్లలో  ఆనందం చూడడం కోసం తమ జీవితాలను త్యాగం చేయగలిగిన వారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత.. జగన్ వీరభక్తులను గుర్తించి, వారివల్ల ప్రభుత్వానికి నష్టం జరగకుండా, ఉద్దేశపూర్వకంగా అపకీర్తి రాకుండా ఉండేందుకు ఏరివేయడం ప్రారంభించారు. కీలక స్థానాల్లో పలువురిని బదిలీలు చేశారు. కానీ.. జగన్ జమానాలో.. కీలక శాఖల్లో నూటికి నూరుశాతం చాపకింద నీరులా తన విధేయుల్ని నియమించారనేది ఆయన గమనించలేకపోయారు. అలాంటి వీరభక్తులు ఇంకా కీలకంగా కొనసాగుతున్న ఫలితమే.. ఇవాళ పులివెందులకు చెందిన వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు వందకోట్ల రూపాయలు బిల్లులు వచ్చేయడం.

వారికి బిల్లులు ఇవ్వకూడదని కాదు. కానీ.. సీనియారిటీ ప్రకారం.. అంతకంటె ముందు చేసిన వారికి ఇవ్వాలి కదా. 2014-19 మధ్య పనులు చేసిన కాంట్రాక్టర్లకు, తెలుగుదేశం సానుభూతి పరులనే ముద్రవేసి.. రూపాయైనా చెల్లించకుండా వారి జీవితాలను చిందరవందర చేశారు జగన్మోహన్ రెడ్డి. అప్పటినుంచి కష్టాలు పడుతున్న కాంట్రాక్టర్లకు ఇంకా చెల్లించనే లేదు. కనీసం ఆర్థిక మంత్రి కి సమాచారం కూడా లేకుండా, ఆ శాఖలోని ఉద్యోగులే వైసీపీ కాంట్రాక్టర్లకు వందకోట్ల మేర బిల్లులు ఇచ్చేయడ జరిగింది. జగన్ తొత్తులను ప్రభుత్వ యంత్రాంగంలోని కీలక స్థానాలనుంచి పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే ముందు ముందు కూడా ఇలాగే ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles