పదినెలల్లో ఎన్నికలొస్తే గెలిచే ధైర్యముందా జగన్?

Friday, December 5, 2025

విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ పై కూటమి పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గడాన్ని మాజీ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు.  విపరీతమైన ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ 58 సీట్లు గెలిస్తే.. మీకు మేయర్ స్థానం దక్కుతుందని ఎలా అనుకున్నారంటూ.. చంద్రబాబునాయుడును నిందించడానికి ఆయన సాహసిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ తరఫున గెలిచిన వారికి ఇప్పుడు జగన్ సారథ్యం మీద నమ్మకం సడలిపోయి.. ఆ పార్టీలో ఆయన వెంట రాజకీయ భవిష్యత్తు అంతరించిపోతుందనే భయంతో రాజీనామాలు చేసి వెళ్లిపోతే.. దానికి ఎవరేం చేయగలరు? జగన్ పై నమ్మకం ఉన్నవారు.. ఇంకా ఆయనతోనే ఉన్నారు. ఆయనపై నమ్మకం లేని వారు.. తమ దారి తాము చూసుకున్నారు. ఇదంతా తన చేతగానితనం ఫలితమే అవుతుండేసరికి, దానిని కప్పిపుచ్చుకోవడానికి జగన్ అసహనంలో చంద్రబాబు మీద విరుచుకుపడుతున్నారు.

కన్నతల్లి పుట్టినరోజు నాడు ఆమెకు కనీసం బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పడానికి కూడా ట్వీట్ చేసే ఖాళీ లేని జగన్మోహన్ రెడ్డి.. విశాఖ మేయర్ స్థానం చేజారడం గురించి మాత్రం తన ఆవేదన మొత్తం సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ లో జగన్ చెబుతున్న ఒక మాటను చాలా కీలకంగా గమనించాల్సి ఉంది.

‘మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్పిల్ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా.. ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబూ.. మీకు లేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు’ అని జగన్ అంటున్నారు.

పది నెలల తర్వాత విశాఖ కార్పొరేషన్ కు మళ్లీ ఎన్నికలు రావడం అనేది నిజమే కావొచ్చు. కానీ ఎన్నికలొస్తే మళ్లీ వైసీపీ 58 డివిజన్లు గెలుస్తుందని చెప్పగల ధైర్యం ఆయనకు ఉన్నదా అనేది ప్రశ్న. ఆయన చెబుతున్నట్టుగా ‘దేవుడు ప్రజలు గుణపాఠం చెప్పబట్టే’ కదా విశాఖ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కకుండా ఆయన పార్టీ చతికిలపడింది అని అంటున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే మాయమాటలు చెప్పి.. విశాఖలో భూకబ్జాలకు తెరతీసి.. సాగించిన దందాల నేపథ్యంలో జగన్ ఇక ఎన్నటికీ విశాఖ కార్పొరేషన్ దక్కించుకోలేరని విశ్లేషణలు వినవస్తున్నాయి. తెలుగుదేశాన్ని, చంద్రబాబును విమర్శించడం మానేసి.. అందరూ తన పార్టీని వదలి వెళ్లిపోతున్నారంటే.. అందులో తన లోపాలు ఏమున్నాయో ఆయన చెక్ చేసుకుంటే బాగుపడతారని అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles