నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అది నిజమే ఏమో కానీ, ఇప్పుడు ఆధునిక ఇంటర్నెట్ యుగంలో అబద్ధాన్ని వెంటనే తేల్చేయడం పెద్ద విశేషం కాదు. ఇవాళ అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతతో ఒక అబద్ధాన్ని సృష్టించడం ఎంత ఈజీనో ఎంత త్వరగా చేయవచ్చునో, అది అబద్ధం అనే సంగతిని కూడా అంతే త్వరగా గుర్తించవచ్చు. ఒక అబద్ధాన్ని పుట్టించడానికి, ఫేక్ సంగతి ప్రచారంలోకి వస్తే.. దాన్ని పుట్టించిన వారిని లీగల్ గా కనుక్కోవడం కాస్త లేటు కావచ్చేమోగానీ.. ఫేక్ అనేది వెంటనే గ్రహించగలం. పుట్టించిన వారిని సులువుగానే ఊహించగలం. ఫేక్ సృష్టించినట్టుగా వారి పరువు పోవడానికి ప్రత్యేకంగా వేరే రుజువులు అవసరం లేదు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఈటీవీ లోగోతో ఫేక్ వీడియోలను సృష్టించి ప్రచారంలో పెట్టినందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభాసు పాలవుతోంది.
చంద్రబాబునాయుడు రాష్ట్రప్రజలకు ప్రకటించిన సూపర్ సిక్స్ వరాలు సూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల గురించి ఇంటింటికీ సమాచారం అందేలా చేయడంలో తెలుగుదేశం శ్రేణులు కృతకృత్యం అయ్యాయి. వాటికి తోడు వాలంటీర్లు, పింఛనుల పెంపు వంటి వ్యవహారాలను వ్యాప్తిలో పెడుతున్నారు. అయితే ఇక్కడే వైసీపీ సోషల్ మీడియా దళాలు.. తమ బుద్ధిని చూపించదలచుకున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై ప్రజల్లో అనుమానాలు పుట్టేలా ఫేక్ వీడియోలను తయారు చేశాయి.
ప్రజల్లో ఎంతో క్రె డిబిలిటీ ఉన్న ఈటీవీ లోగోతో.. ఈటీవీలో ప్రసారం అయిన క్లిపింగ్ మాదిరిగానే ఒక వీడియోను రూపొందించారు. అందులో సూపర్ సిక్స్హ్ హామీలను తెలుగుదేశం పార్టీ వెనక్కు తీసుకుందని, ఆ మేనిఫెస్టోను రద్దు చేసుకుందని ప్రకటించారు. ఈ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా దళాలు వైరల్ చేశాయి. అయితే ఈటీవీ యంత్రాంగం ఇలాంటి ఫేక్ వీడియోల పట్ల వెంటనే అప్రమత్తమైంది. క్రెడిబిలిటీ గల తమ చానెల్ పేరుతో ఇలాంటి ఫేక్ లు ప్రచారంలో పెడుతున్నారంటూ, పోలీసులకు, ఎన్నికల సంఘం అధికార్లకు ఫిర్యాదుచేసింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల మీద చంద్రబాబునాయుడు కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీల గురించి మరింతగా పునరుద్ఘాటిస్తున్నారు.
అయితే, మరీ లేకిగా ఇలాంటి ఫేక్ ప్రచారాలు పుట్టిస్తున్నందుకు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భ్రష్టుపట్టిపోయింది. ఇలాంటి కుయుక్తులు జగన్ కు చేటుచేస్తాయి తప్ప.. గెలిపించవు కదా.. నిజాన్ని ప్రజలు గ్రహిస్తారు కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ ఫేక్ ప్రచారాలు జగన్‌కు చేటుచేయవా?
Sunday, December 22, 2024