వచ్చే ఏడాదినుంచే కాగ్నిజెంట్ కొలువుల జాతర!

Tuesday, December 16, 2025

ఇలాంటి వార్తలు బహుశా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు చాలా చేదుగా ధ్వనిస్తుండవచ్చు. మింగుడుపడకపోవచ్చు. కంపెనీలు ఏర్పాటుకావడం అంటే వారికి వెగటు. యువతకు ఉద్యోగాలు రావడం అంటే వారికి కంపరం. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి పాలన సాగడం లేదు గనుక.. వారికి ఇష్టంలేని విషయాలు కూడా జరగుతుంటాయి. విశాఖలో ఏర్పాటు కాబోతున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా కంపెనీ సరిగ్గా ఏడాదిలోగా, అంటే 2026 జూన్ లోగా తమ విశాఖ క్యాంపస్ లో కొలువుల జాతరను ప్రారంభించనుంది. రాష్ట్ర యువతలో ఇలాంటి వార్తలు హర్షాతిరేకాల్ని నింపుతుండగా.. వైసీపీ నాయకులు ఉడికిపోతున్నారు.

విశాఖను రాష్ట్రానికి ఐటీ హబ్ గా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. విశాఖలో టీసీఎస్ బ్రాంచి ఏర్పాటు చేయడానికి ఎకరా 99 పైసల వంతున ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే 1582 కోట్ల రూపాయల పెట్టుబడులతో 8వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు కాబోతున్న కాగ్నిజెంట్ కంపెనీకి  కూడా అదే ధరకు 22.19 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ స్థలంలో 2029 సంవత్సరానికి తాము కార్యకలాపాలు ప్రారంభించగలం అని కాగ్నిజెంట్ ప్రకటించింది. అయితే అదే ఏడాదిలో ఎన్నికలు కూడా ఉంటాయి గనుక.. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా పనులు చేయాలని నారా లోకేష్ సారథ్యంలో అధికారులు కాగ్నిజెంట్ తో సంప్రదింపులు జరిపారు. ఆ నేపథ్యంలో మొదటి దశ ప్రాజెక్టు పనులను 2028 జూన్ లోగా పూర్తి చేయగలమనం కాగ్నిజెంట్ తెలిపింది. ఇది పెద్ద విజయమే కాగా.. యువతకు ఇంకా తొందరగా ఉద్యోగాలు కల్పించడం గురించి.. అధికారులు ప్రయత్నించారు.
మొత్తానికి వచ్చే ఏడాది అంటే 2026 జూన్ లోగా లీజుకు ఒక క్యాంపస్ తీసుకుని తమ కార్యకలాపాలు ప్రాథమికంగా ప్రారంభిస్తాం అని.. అప్పటికి కనీసం 500 మందికి ఉద్యోగావకాశాలు అందుతాయని సంస్థ ప్రకటించింది. ఇది చాలా మేజర్ పరిణామంగా పలువురు భావిస్తున్నారు.

జగన్ పరిపాలన సాగిన అయిదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా రాలేదు. అసలు జగన్ యువతకోసం ఉద్యోగాల కల్పన కోసం దృష్టి పెట్టనేలేదు. విశాఖలో ఒకసారి నిర్వహించిన పారిశ్రామిక వేత్తల భేటీ ఒక ప్రహసనంలాగా ముగిసింది. గ్రౌైండ్ అయిన కంపెనీలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు అందించే ఐటీ కంపెనీలకు చవకగా భూములిస్తోంటే.. నానా యాగీ చేయడం మాత్రం ప్రారంభించారు. అక్కడికేదో వారికి దోచిపెట్టేస్తున్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. కానీ వేలలో రాష్ట్ర యువతకు అందివస్తున్న ఉద్యోగాల గురించి మాత్రం మాట్లాడడం లేదు. వారి కుట్రలు ఎలా సాగుతున్నప్పటికీ.. వచ్చే ఏడాదిలోనే ఉద్యోగాలు కల్పించి కార్యకలాపాలు ప్రారంభించడానికి కాగ్నిజెంట్ సిద్ధపడడం శుభపరిణామం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles