మిర్చి రైతుకోసం చిత్తశుద్ధి చూపిస్తున్న చంద్రబాబు!

Saturday, April 12, 2025

మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారు. కోడ్ నిబందనలు ఉల్లంఘించి పోలీసులు వారిస్తున్నా వినకుండా గుంటూరు మిర్చియార్డుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. పైపెచ్చు, పోలీసులకు తనకు సరైన భద్రత కల్పించలేదంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇదంతా ఒక చవకబారు ఎత్తుగడలు కాగా, ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు ఇంకో ఎత్తు. నిజానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన ప్రణాళికతో అడుగులు వేస్తోంది. జగన్ మాటలు చెబుతూ.. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు గానీ.. చంద్రబాబునాయుడు.. కేంద్రంతో మంతనాలు సాగించి.. మిర్చి రైతుల నష్టనివారణ కోసం తన చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నారు.

రాష్ట్రంలో సరైన ధర పలకకపోవడం వలన మిర్చి రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని అధికార పార్టీ కూడా కాదనడం లేదు. కానీ.. జగన్ లాగా యార్డుకు వచ్చి ఒక ఉపన్యాసం ఇస్తే సరిపోదు. దానివల్ల రైతుల కష్టాలు తీరవు. ప్రభుత్వంలో ఉన్నవారు బాధ్యతగా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబునాయుడు అదే పనిచేస్తున్నారు. మిర్చి రైతుల కష్టాలు జగన్ కు ఇవాళ కనిపించాయి కావొచ్చు గాక.. ఆయన రాజకీయం కోసం దానిని వాడుకుంటున్నారు. కానీ చంద్రబాబుకు వారి కష్టాలు రెండు నెలల కిందటే కనిపించాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ప్రభుత్వం డిసెంబరులోనే మిర్చి రైతులను ఆదుకోవాల్సిందిగా రెండు లేఖలు రాసింది. తాజాగా మరో సమీక్ష సమావేశం అధికార్లతో నిర్వహించారు. మళ్లీ కేంద్ర మంత్రికి ఒక లేఖ రాశారు. అందులో మిర్చి రైతుల బాగుకోసం అద్భుతమైన ప్రతిపాదనలు చేశారు చంద్రబాబు.

మార్కెట్ జోక్యం పథకం కింద నష్టపోతున్న మిర్చి రైతుల్ని ఆదుకోవాలని చంద్రబాబు కోరుతున్నారు. కేంద్రం అమలుచేసే ఈ పథకంలో ఉత్పత్తిలో 25 శాతం పంటకు మాత్రమే సాయం అందిస్తారు. ఆ నిబంధనను పక్కన పెట్టి 75 శాతం పంటకు సాయం అందించాలని చంద్రబాబు కోరుతున్నారు. అలాగే.. ఈ పథకం కింద యాభై శాతం సాయం రాష్ట్ర ప్రభుత్వం భరించాలనేది నియమం. ఏపీ ప్రస్తుతం ఉన్న ఆర్థిక విపత్కర పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం సాయం కేంద్రమే భరించాలని కూడా చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు.

కేవలం లేఖ రాయడంతో చంద్రబాబు ఆగలేదు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లారు. అక్కడ కేంద్ర వ్యవసాయమంత్రితో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేదిని కలిసి చర్యలు తీసుకోవాలని కోరబోతున్నారు. చంద్రబాబునాయుడు నిర్దిష్ట ప్రణాళికతో మిర్చి రైతుల్ని ఆదుకునే పనులు చేస్తుండగా.. జగన్ మాత్రం.. దీనిని రాజకీయంగా వాడుకుంటూ.. మైలేజీ కోసం తాపత్రయ పడుతుండడం రైతులకు చిరాకు తెప్పిస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles