బీ రెడీ ఫ్యాన్స్‌..ఫస్ట్‌ ఆఫ్‌ లాక్ అయ్యింది!

Tuesday, January 21, 2025

టాలీవుడ్‌ లో ఎంతో ప్రెస్టీజియస్‌ గా తెరకెక్కుతున్న సీక్వెల్‌ సినిమా ఏదైనా ఉందంటే అది పుష్ప 2 అనే చెప్పుకొవచ్చు. యావత్‌ భారత్‌ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌ పాత్రలో మరోసారి బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసేందుకు రెడీగా ఉన్నాడు.

ఈ సినిమాను డిసెంబర్ 6న విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించడంతో, ఈ సినిమా ఫైనల్ ఔట్‌పుట్ విషయంలో మేకర్స్ చాలా కష్టపడుతున్నారు.  తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లుగా మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్‌తో థియేటర్లు తగలబడిపోవాల్సిందేనని వారు ధీమాగా ఉన్నారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తుఫాను రావడం ఖాయమని వారు అంటున్నారు. దీంతో ‘పుష్ప-2’ ఫ్యాన్స్ ఈ మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అల్లు అర్జున్ నటవిశ్వరూపంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరోసారి దుమ్ములేవాల్సిందేనని అభిమానులు ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. అందాల భామ రష్మిక  ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles