టాక్సిక్‌ లో మరో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

Thursday, December 26, 2024

కేజీఎఫ్‌ సిరీస్‌ తరువాత యశ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా టాక్సిక్‌. ఈ సినిమాని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.  టాక్సిక్‌లో బాలీవుడ్ భామ కరీనా కపూర్‌ నటించనుందని ముందునుంచి నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.

తాజాగా టాక్సిక్‌లో మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ నటించనున్నట్లు సమాచారం.ఈ సినిమాలో  ఓ ముఖ్య పాత్రను హ్యూమా ఖురేషీ చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఈ సినిమా కథను దర్శకురాలు చెప్పగా.. ఆమెకు నచ్చి ఒకే చెప్పారట. టాక్సిక్‌లో హ్యూమా ఖురేషీ పాత్ర పూర్తిగా యాక్షన్‌ కోణంలో ఉండనున్నట్లు సమాచారం. టాక్సిక్‌లో నయనతార, కరీనా కపూర్‌, హ్యూమా ఖురేషీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ఇప్పటివరకు చిత్ర బృందం ఎలాంటి అధికారిక సమాచారం లేదు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా టాక్సిక్‌ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్నట్లు తెలిసింది. అందుకే యూఎస్‌లోని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోలతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles