బాలీవుడ్‌ రామాయణానికి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..వామ్మో?

Friday, November 1, 2024

రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వస్తున్నా కూడా ఇప్పటికీ వాటిని చూసేవారు చాలామందే ఉంటారు. ఈ క్రమంలోనే రామాయణం ఆధారంగా ఇప్పటికీ కొత్త సినిమాలను తీస్తూనే ఉన్నారు.  తాజాగా బాలీవుడ్ లో రామాయణం కథతో ఇప్పుడు మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాగా రామాయణం రాబోతున్న విషయం తెలిసిందే.

 ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ డైరెక్షన్‌ చేస్తుండగా.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 835 కోట్లు అని టాక్‌ వినిపిస్తుంది. ఈ షూటింగ్ ఇప్పటికే మొదలు అయ్యింది. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా బడ్జెట్ 835 కోట్లు అంటే మామూలు విషయం కాదు. రామాయణం: పార్ట్ 1’ బడ్జెట్ 835 కోట్లు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ లో తెగ షికారు చేస్తుంది. కేవలం 600 రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు ఇంత బడ్జెట్ అన్న విషయం వైరల్ గా మారింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles