అరుదైన గౌరవం అందుకున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

Wednesday, January 22, 2025

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్‌ గా పెరొందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎమ్‌డీబీ విడుదల చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్‌ యాక్టర్స్ జాబితాలో దీపికా అగ్రస్థానంలో నిలిచింది. ‘టాప్‌ 100 మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్స్‌’ పేరుతో గత పదేళ్ల కాలంలో పాపులర్‌ అయిన సినీ తారల జాబితాను ఐఎండీబీ రీసెంట్‌ గా విడుదల చేసింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతో సహా బాలీవుడ్ ప్రముఖులను అధిగమించి దీపికా నెంబర్‌వన్‌ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో షారుఖ్  రెండో స్థానంలో ఉండగా.. ఐశ్వర్య రాయ్ మూడో స్థానంలో ఉంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ రాణిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను దీపికా తన సొంతం చేసుకుంది.

 దీపికా ప్రస్తుతం గర్భవతి అన్న విషయం తెలిసిందే. నటుడు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా దంపతులు త్వరలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. దీపికా గర్భం దాల్చిన ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆమె బేబీ బంప్ వీడియో, ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles